బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 9వ వారం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ రెండు టీమ్స్ గా విడిపోయారు. వీర సింహాలు – గర్జించే పులులుగా విడగొట్టాడు బిగ్ బాస్. ఒకరికి ఎల్లో, ఒకరికి ఆరెంజ్ బ్యాండ్స్, క్యాప్స్ ఇచ్చాడు. వీటిని ధరించి బిగ్బాస్ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పైప్ ద్వారా వచ్చే బాల్స్ ని క్యాచ్ చేసి వారికి ఇచ్చిన పౌచ్ లో జాగ్రత్తగా దాచుకోవాలి.
వీటిని డ్రెస్ లో కానీ, వేరే ఎక్కడైనా కానీ పెట్టకూడదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ టాస్క్ లోనే పవర్ బాక్స్ ఓపెన్ చేసేందుకు వివిధ ఛాలెంజస్ వస్తాయని చెప్పాడు బిగ్బాస్. మొదటి ఛాలెంజ్ లో భాగంగా “జంపింగ్ జపాంగ్” అనే టాస్క్ ని ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఆరెంజ్ టీమ్ నుంచీ ఇద్దరు, ఎల్లో టీమ్ నుంచీ ఇద్దరూ వచ్చి టాస్క్ ఆడాలని చెప్పాడు. దీంతో అర్జున్ – ప్రశాంత్ ఎల్లో టీమ్ నుంచీ అలాగే తేజ – యావర్ రెడ్ టీమ్ నుంచీ వచ్చారు.
బెలూన్స్ ఊదుతూ టాస్క్ లో ఏర్పాటు చేసిన రోప్ స్టాండ్ పై నుంచీ జంప్ చేసి, అక్కడ ఉన్న టైర్స్ లో బెలూన్స్ ని స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో తేజ, ప్రశాంత్ బెలూన్స్ ఊదితే అర్జున్ – యావర్ జంప్ చేస్తూ టైర్స్ లో బెలూన్స్ ని అతికించారు. ఈ టాస్క్ లో యావర్ – తేజ విజయం సాధించారు. అర్జున్ – ప్రశాంత్ ఓడిపోయారు. ఓడిపోయిన టీమ్ నుంచీ ఒకరిని తప్పించే బాధ్యత రెడ్ టీమ్ పైన పెట్టాడు బిగ్ బాస్. దీంతో గ్రూప్ డిస్కషన్ మొదలైంది.
గ్రూప్ లో కెప్టెన్ గా ఉన్న గౌతమ్ ప్రశాంత్ ని తీసేద్దామని చెప్పాడు. అందరూ ఓకీభవించారు. అయితే, దీనికి కారణాలు చెప్పాడు గౌతమ్. నామినేషన్స్ లో ప్రశాంత్ లేడు కాబట్టి తీసేస్తున్నామని, అంతేకాదు, శివాజీకి అలాగే అశ్వినికి కూడా ఆడే అవకాశం ఇంతవరకూ రాలేదని, ప్రశాంత్ లాస్ట్ వీక్ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడని చెప్పాడు. దీనికి అందరూ కూడా ఏకీభవించారు. కానీ, ప్రశాంత్ మాత్రం దూరంగా వెళ్లి కూర్చుని ఏడ్వటం మొదలుపెట్టాడు.
ప్రశాంత్ ఏడుస్తుంటే శివాజీ వచ్చి ధైర్యం చెప్పాడు. (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ హౌస్ లో ఇది చాలా కామన్. ఈ ఆటలో తీసేస్తే ఏమైంది వచ్చే ఆటలో బాగా ఆడు అంటూ అన్నాడు. అంతేకాదు, ఇన్ని టాస్క్ లు ఆడావ్ కదా, అందరికీ అవకాశం ఇచ్చానని అనుకో అన్నట్లుగా చెప్పాడు. చాలాసేపు బాధపడిన తర్వాత ప్రశాంత్ మళ్లీ నార్మల్ అయ్యాడు. మరి ఈ పవర్ బాక్స్ ఛాలెంజ్ లో ఏ టీమ్ గెలిచి కెప్టెన్సీ అర్హతని సాధిస్తుందనేది చూడాలి. అదీ మేటర్.