Pallavi Prashanth: ఆ కారణంతోనే ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారా?
- December 19, 2023 / 01:41 PM ISTByFilmy Focus
పల్లవి ప్రశాంత్ ఒక సాధారణ రైతుబిడ్డగా యూట్యూబ్ ఛానల్ లో కొన్ని వీడియోలు చేసుకుంటూ గుర్తింపు పొందినటువంటి ఈయన ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టినటువంటి ప్రశాంత్ తన ఆటతీరుతో అందరిని మెప్పించారు. ఇలా ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విజేతగా తిరిగి బయటకు వచ్చారు. ఇక పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న తర్వాత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈయన ఒకానొక సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాను అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అసలు పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేశారు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయానికి వస్తే.. ఈయన ఒకసారి తాను అని నమ్మిన వారి పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే తన స్నేహితులతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారట.

ఎన్నో వీడియోలు చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడంతో బాగా క్లిక్ అవుతూ డబ్బులు రావడం కూడా ప్రారంభమయ్యాయి. అయితే యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తున్నటువంటి తరుణంలో తన స్నేహితులు ప్రశాంత్ ను ఆ ఛానల్ నుంచి తప్పించారని తెలుస్తుంది. ఈ విధంగా పల్లవి ప్రశాంత్ ను తన స్నేహితులు మోసం చేయడంతో ఎంతో కుమిలిపోయి ఈయన ఆత్మహత్యకు పాల్పడ్డారట

కానీ తన తల్లిదండ్రులు తనని ఓదార్చి తనకు ధైర్యం చెప్పడంతో కాస్త రికవరీ అయ్యారని అనంతరం తన తండ్రి తనకోసం ఒక మొబైల్ ఫోన్ తీసి ఇవ్వడంతో ఈయన (Pallavi Prashanth) కూడా వీడియోలు చేయడం ప్రారంభించారని తెలుస్తోంది.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!














