బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 5వ వారం ఇంటి మొదటి కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. మొన్న వారం వరకూ ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ ఈవారం మాత్రం కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఈవారం ఇమ్యూనిటీతో పాటుగా వచ్చేవారం కూడా సూపర్ ఇమ్యూనిటీ వస్తుందని చెప్పాడు. దీంతో కెప్టెన్ అయిన ఎవ్వరూ కూడా ఎలిమినేట్ అవ్వరన్నమాట. అన్ని సీజన్స్ లో ఇది ఉండేది కాదు, కానీ ఈ సీజన్ లో మాత్రం సూపర్ ఇమ్యూనిటీ అనేది పెట్టారు.
అయితే, దీనికోసం లెటర్స్ ని శాక్రిఫైజ్ చేసి బడ్డీస్ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ప్రిన్స్ – తేజలో తేజ లెటర్ చదివి కెప్టెన్సీ పోటీదారుడు అయ్యాడు. అలాగే గౌతమ్ ఇంకా శుభశ్రీ ఇద్దరి జంటలో గౌతమ్ పోటీదారుడు అయితే, శివాజీ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరిలో పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ పోటీదారుడు అయ్యాడు. తర్వాత సందీప్ అమర్ ఇద్దరిలో సందీప్ కెప్టెన్ గా అవ్వడానికి ముందుకు వెళ్లాడు. ఈ నలుగురు పెయింట్ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు.
ఈ టాస్క్ లో ముందుగా తేజ అవుట్ అయ్యాడు, ఆ తర్వాత సందీప్ అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరి తర్వాత గౌతమ్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరి మద్యలోనే గట్టి పోటీ ఏర్పడింది. గౌతమ్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరిలో పల్లవి ప్రశాంత్ ఇంటి కెప్టెన్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. నిజానికి శివాజీ శాక్రిఫైజింగ్ తో ఇంటి కెప్టెన్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. దీనికోసం శివాజీకి ఖచ్చితంగా కాఫీ బడ్జెట్ ని కేటాయిస్తాడు.
అలాగే, మిగతా బ్యాచ్ ని కూడా కంట్రోల్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, ఇంటి కెప్టెన్ గా తను ఎలా ఉండాలో పల్లవి ప్రశాంత్ కి బాగా తెలుసు. ఏమాత్రం మిగతా వాళ్లు తోక జాడించినా కూడా బిగ్ బాస్ ఈ కెప్టెన్సీ ని రద్దు చేస్తాడు. ఇక పల్లవి ప్రశాంత్ మొన్న వారం టాస్క్ గెలిచి ఇమ్యూనిటీ సంపాదించాడు. అలాగే ఈవారం కెప్టెన్ అయి వచ్చే వారం కూడా ఇమ్యూనిటీ సాధించాడు.
దీంతో పల్లవి ప్రశాంత్ నెక్ట్స్ వీక్ కూడా నామినేషన్స్ లోకి రాడు. ఆల్రెడీ (Bigg Boss 7 Telugu) ఈవారం తనకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నామినేషన్స్ లో కూడా లేడు. అయితే బిగ్ బాస్ ఈ పవర్ ని ఎప్పుడైనా సరే క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుంది. హౌస్ మేట్స్ ని కంట్రోల్ చేయడంలో విఫలం అయితే మాత్రం ఖచ్చితంగా ప్రశాంత్ పవర్ పోతుంది. ఇక మరోవైపు సీరియల్ బ్యాచ్ ప్రశాంత్ మాట వింటారా లేదా అనేది ఆసక్తికరం.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !