Guppedantha Manasu: రిషి పై అటాక్ కి ప్లాన్ చేసిన శైలేంద్ర.. ప్రమాదంలో రిషి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు మరింత ఆదరణ పొందుతుంది.నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా జగతి మహేంద్ర తిరిగి వెళ్ళిపోవాలని బయటకు వస్తూ విశ్వనాథం గారికి వీడ్కోలు పలుకుతారు. కాని వాళ్ళని కూడా ఇలా ఇంట్లో పెట్టుకుని మంచిగా చూసుకుంటున్నారు. రిషిని అలాగే ఆక్సిడెంట్ అయినటువంటి వసుధారను కూడా ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీరు గ్రేట్ అంటూ జగతి మాట్లాడుతుంది.

ఇక ఏంజెల్ వద్దకు వెళ్లి రిషిని సేవ్ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ మరోసారి థాంక్స్ చెబుతుంది దాంతో ఏంజెల్ నేను నా ఫ్రెండ్ ని సేవ్ చేశాను ఆయన మీరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారని మాట్లాడుతుంది. వెంటనే వసుధార కల్పించుకొని రిషి సార్ చాలా గొప్పవారు కదా అలాంటి వారిని సేవ్ చేశారంటే ఎవరికైనా థాంక్స్ చెప్పాలనిపిస్తుంది అంతే కదా మేడం అంటూ కవర్ చేస్తుంది వసుధర. రిషినీ నేను జాగ్రత్తగా చూసుకుంటానని ఏంజెల్ చెప్పడంతో జగతి సంతోషపడుతుంది.

తర్వాత జగతి వసుధార వద్దకు వెళ్లి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం రిషి సార్ ని ఎలాగైన పంపించండి అని చెబుతుంది దాంతో వసుధార రిషి సార్ తప్పకుండా ఒప్పుకుంటారని చెప్పడంతో రిషి లేకపోయినా ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అయితే వీరు వెళుతుండగా రిషి ఎదురు రావడంతో ఇబ్బందిగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు కాలేజీలో లెక్చరర్స్ అందరూ కూడా రిషి వసుధార గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. అది విన్నటువంటి పాండియన్ వారి వద్దకు వెళ్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు.

ఇంకొకసారి వసుధార మేడం రిషి సార్ గురించి తప్పుగా మాట్లాడితే మీరు తిరిగి పాత పాండియన్ ను చూడాల్సి ఉంటుంది. మీరు ఇలా మాట్లాడుతున్న నేను ఊరికే ఉన్నాను అంటే అది రిషి సార్ నాకు నేర్పిన సంస్కారం. మీరు ఇక్కడ జీతం కోసం మాత్రమే పనిచేస్తున్నారు. కానీ వాళ్లు విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు అంటూ వార్నింగ్ ఇస్తారు. మరోవైపు రిషి హాల్లో కూర్చుని డాడ్ వాళ్లు ఎందుకు వచ్చారు. వాళ్లు రావడంతో చిరాకుగా ఉంది కానీ ఎందుకో తెలియని ప్రశాంతత కూడా ఉందని అనుకుంటాడు.

అయినా నా చుట్టూ నా వాళ్ళందరూ ఉండడం నాకు సంతోషంగా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు. పైన కూడా రిషి గురించి వసుధార ఆలోచిస్తూ పేపర్ పై విఆర్ అని రాసి ఉంటుంది. ఆ పేపర్ గాలికి వచ్చే రిషి దగ్గర పడటంతో అది చూసిన రిషి చింపేయబోతాడు దానిని చింపి నా మనసు గాయపరచకండి అని వసుధర అంటుంది మీరు పక్కవారి మనసు గాయపరచవచ్చు కానీ నేను గాయపరచకూడదా అంటూ మాట్లాడుతాడు రిషి. ఇప్పుడు కూడా నేను మీకు నిజం చెప్పవచ్చు.

కానీ మీరే కారణం తెలుసుకోండి అని అక్కడి నుంచి వసుధార వెళ్ళిపోగా రిషి పొగరు అనుకుంటాడు. మరోవైపు శైలేంద్ర రిషీని చంపడానికి ప్లాన్ చేస్తారు. రౌడీలను విశ్వం ఇంట్లోకి పంపి ఎలాగైనా వాడిని చంపేయమని చెబుతారు వాడిని చంపేస్తే మీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పి పంపిస్తారు. ఎవరికి తెలియకుండా రౌడీలు విశ్వం ఇంట్లోకి వెళ్తారు. హాల్లో రిషి ఫోన్ చూస్తూ కూర్చుని ఉంటారు. అదే సమయంలో రౌడీలు తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంతటితో (Guppedantha Manasu) ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus