Paradha Teaser Review: సుబ్బు ఎందుకు పరదా పెట్టుకోవాల్సి వచ్చింది?
- January 22, 2025 / 06:17 PM ISTByPhani Kumar
అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో ‘పరదా’ (Paradha) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఆనంద్ మీడియా’ బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula) ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను కొద్దిసేపటి క్రితం యూట్యూబ్లో విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1 :33 నిమిషాల నిడివి కలిగి ఉంది.
Paradha Teaser Review:

అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన.. పాత్రలని ఈ టీజర్ ద్వారా పరిచయం చేశారు. అనుపమ.. సుబ్బు అనే పాత్రలో కనిపించబోతుంది.ఆమె ముఖానికి పరదా పెట్టుకుని ఎక్కువగా కనిపించింది.’యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అనే లైన్ తో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఈ కథని రాసుకున్నట్టు తెలుస్తుంది. సుబ్బు(అనుపమ) ఊరికి చెందిన ఆడవాళ్లు.. కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఆ సమస్యలు ఏంటి? వాళ్ళను ఆ సమస్యల నుండి విడిపించడానికి సుబ్బు ఏం చేసింది? ఈ క్రమంలో సంగీత, దర్శన పాత్రలు చేసిన సహాయం ఏంటి? అనేది ఈ సినిమా కథ అని అనిపిస్తుంది. టీజర్లో లొకేషన్స్ హైలెట్ అయ్యాయి. మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అదిరిపోతుందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. గోపి సుందర్ (Gopi Sundar) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. నిర్మాతలు కూడా బాగా ఖర్చు పెట్టినట్టు ఉన్నారు.టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :












