టాలీవుడ్ బడా నిర్మాతలకి షాక్ ఇస్తూ ఈరోజు ఐటీ శాఖ.. రైడ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఇంట్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు ఈ సోదాలు కొంచెం కఠినంగానే వారు నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతుంది. దిల్ రాజు ఇల్లు, ఆఫీసులు మాత్రమే కాదు.. ఆయన కూతురు హన్షిత రెడ్డి ఇంట్లోనూ అలాగే అతని తమ్ముడు శిరీష్ (Shirish)- లక్ష్మణ్ ..ల ఇంట్లోనూ.. ఇలా ఆయన కుటుంబ సభ్యులందరి ఇళ్ళల్లోనూ కూడా ఐటీ సోదాలు నిర్వహించారు అధికారులు.
ఇక ఇందులో భాగంగా దిల్ రాజు భార్య తేజస్వినిని కూడా ఐటీ అధికారులు విచారించడం.. తర్వాత ఆమె బ్యాంకు ఖాతా లావాదేవీల గురించి ఆరా తీయడం జరిగిందట. అక్కడితో అయిపోలేదు ఆమె ఖాతా ఉన్న బ్యాంకు..కి తీసుకెళ్లి, లాకర్లు ఓపెన్ చేయించి చెక్ చేశారట. స్వయంగా దిల్ రాజు భార్య తేజస్విని ఈ విషయాన్ని తెలియజేశారు. ‘మా ఇంట్లో ఐటీ రైడ్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. నన్ను బ్యాంకుకు తీసుకెళ్లి మరీ లాకర్లు తెరిచి చూపించాలని, ఐటీ అధికారులు కోరారు.
వారు చెప్పినట్టే నేను చేశాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ‘ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. ఐటీ అధికారులు అకౌంట్స్ వరకు చెక్ చేయడం ఓకె.కానీ బ్యాంకుకి తీసుకెళ్లి మరీ వారి ఖాతాల్లోని డబ్బు, నగలు వంటి చెక్ చేయడం చట్ట రీత్యా సమంజసమేనా?’ అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏ రేంజ్లో పవర్స్ ఇచ్చారో ఎవ్వరికీ తెలీదు కదా..! ఇక ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) వంటి సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.