Heroine: మతం మార్చుకుని మరీ పెళ్ళై, పిల్లలు కూడా ఉన్న వ్యక్తికి రెండో భార్య అయ్యింది!

ప్రేమ, పెళ్లి వంటి వ్యవహారాలు సినిమా వాళ్ళకి కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు చెప్పుకోబోతున్న విషయం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వివరాల్లోకి వెళితే… మలయాళ సీరియల్ నటి రస్న గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలిసుండకపోవచ్చు. ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే సింధూర చెప్, వెళంకన్ని మాటవ్, బృందావనం, వధు అండ్ నందనం వంటి సీరియల్స్ లో నటించింది. పారిజాతం అనే సీరియల్ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈమె బుల్లితెరపై స్టార్ గా రాణిస్తున్న రోజుల్లో దర్శకనిర్మాత బైజు దేవరాజన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పేసింది.

అయితే మొదట వీరిద్దరి ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయినా సరే రస్నా.. దేవరాజ్ కోసం మతం మార్చుకుని మరీ తన పేరును సాక్షిగా మార్చుకుంది. ఈ దంపతులకి దేవానంద, విఘ్నేశ్ వంటి పిల్లలు ఉన్నారు. అయితే రస్నా.. దేవరాజ్ ని పెళ్లి చేసుకోవడానికి.. కుటుంబ సభ్యులు నిరాకరించడానికి బలమైన కారణం ఉంది. అప్పటికే దేవరాజ్ కి పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు. పైగా ఏజ్ గ్యాప్ కూడా ఇద్దరి మధ్య చాలా ఉంది.

అందుకే పెద్దలు మాత్రమే కాదు.. అభిమానులు సైతం వీరి పెళ్లిని వ్యతిరేకించారు. అయితే రస్నా .. దేవరాజ్ ను కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంది అనే ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. అవేమీ వీరు పట్టించుకోకుండా హ్యాపీగా జీవిస్తున్నారు. దేవరాజ్ నిర్మిస్తున్న సీరియల్స్ ను రస్నా (Heroine) తన సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేస్తూ వస్తుంది.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus