Hero Ram, Parineeti: రామ్‌ సినిమాలో బాలీవుడ్‌ నాయిక… ఇలా ఇంకెన్నాళ్లు

టాలీవుడ్‌లో స్టార్‌ హీరో సినిమా స్టార్ట్‌ అవుతోంది అంటే… ఆ మధ్య వినిపించే కామన్‌ పుకారు ‘ఈ సినిమాలో కథానాయికగా పరిణీతి చోప్రాను అనుకుంటున్నారు’. మీరూ ఇలాంటి పుకార్లు వినే ఉంటారు. మాకు గుర్తుండి గత ఆరేడేళ్లుగా ఇలాంటి పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో పరిణీతి చోప్రా ప్లేస్‌లోకి జాన్వీ కపూర్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పరిణీతి చోప్రా పేరు వినిపిస్తోంది. అంటే లూప్‌ సినిమాలో లాగా రిపీట్‌ అన్నమాట.

Click Here To Watch

రామ్‌ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇటీవల ఓ సినిమాను అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించబోతున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. అంటే తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో సినిమాకు ఆయా చోట్లా ఫేమ్‌ కోసం అక్కడి నుండి నటులను తీసుకునే ఉద్దేశంలో ఉన్నారట. ఈ క్రమంలో కథానాయికను బాలీవుడ్‌ నుండి తీసుకుంటున్నారట.

దీంతో రామ్‌ సినిమాలో పరిణీతి చోప్రా అంటూ ఓ ప్రచారం మొదలైంది. నిజానికి ఆమె ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. కానీ ఈ ప్రచారం ఎప్పటిలాగే ఆనవాయితీగా సాగింది అనే వార్తలొస్తున్నాయి. రామ్‌ సరసన ఇప్పుడు ఆ సీనియర్‌ నాయికను తీసుకుంటారా? లేక కొత్త నాయికను తీసుకుంటారా అనేది ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట చిత్రబృందం. పరిణీతికి బాలీవుడ్‌ ప్రస్తుతం ఏమంత మంచి ఫేమ్‌ లేదు. వరుస పరాజయాలతో పరిణీతి అక్కడ రేసులో వెనుకబడింది.

దీంతో ఇప్పుడు పరిణీతిని తీసుకుంటే సినిమాకు అక్కడ అంత ఫేమ్, పేరు కష్టమే కదా… కాబట్టి పరిణీతి పేరు ఇన్‌స్టంట్‌ పుకారు మాత్రమే అనే మాట వినిపిస్తోంది. చిత్రబృందం తారా సుతారియా, అనన్య పాండే, జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌ లాంటి యువ కథానాయికలను తీసుకుంటే సినిమాకు ఉపయోగమనేది సోషల్‌ మీడియా మాట. మరి పరిణీతి అనే ఇన్‌స్టంట్‌ పుకారు నిజమవుతుందో, సోషల్‌ మీడియా మాట నిజమవుతుందో చూడాలి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus