మనోజ్ బాజ్‌పాయ్ నటించే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎప్పుడు హిట్ అవుతాయో, ఎప్పుడు వైరల్ అవుతాయో అస్సలు ఊహించలేం. సగటు కంటెంట్ అని ప్రేక్షకుడు అనుకుంటే.. అంతకుమించి అనే రేంజిలో కంటెంట్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ థియేటర్ టర్న్‌డ్ ఓటీటీ సినిమా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. తొలుత ఓటీటీలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించేసరికి థియేటర్లలో విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమాను ‘ఒక్కడు చాలు’ అని పేరు పెట్టారు. తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన విశ్లేషణ ఇచ్చారు.
జీ5లో ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’లో మనోజ్ బాజ్‌పాయ్, సూర్య మోహన్ కులశ్రేష్ట ప్రధాన పాత్రల్లో నటించారు. 16 ఏళ్లు నిండని అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని 5 సంవత్సరాలు కోర్టులో పోరాడి… న్యాయం చేసిన ఓ సాధారణ న్యాయవాది కథ ఈ సినిమా. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. సాధారణంగా కోర్టు రూమ్ డ్రామాలంటే సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడతాడు అంటారు. కానీ ఈ సినిమా అందరూ మెచ్చేలా తెరకెక్కించారు.
‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమాలో న్యాయం కోసం పోరాడే అమ్మాయిని అమాయకంగా చూపించారు. అలా కాకుండా పోరాడే ధైర్యం ఉన్న అమ్మాయికి మాట్లాడే ధైర్యం కూడా ఉన్నట్లు చూపిస్తే ఇంకా బాగుండేది అని పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు. అలాగే ఆ అమ్మాయి ఆవేదనను కొంచెం తక్కువగా చూపించారు. ఆ బాబా వల్ల తను పడిన ఇబ్బందులు ఇంకొన్ని సీన్లు ఉండి ఉంటే బాగుండేది అని చెప్పారు.
‘ఒక్కడు చాలు’ సినిమా ద్వారా న్యాయానికి సంబంధించిన మంచి పాయింట్‌ను ప్రపంచానికి అందించారని మెచ్చుకున్న ఆయన.. ‘ఒక్కడు చాలు’ అని మంచి పేరు ఎంచుకున్నారన్నారు. భయం లేకుండా న్యాయం కోసం మనం పోరాటం చేయాలి అని ఈ సినిమా ద్వారా సందేశం ఇచ్చారు. ఇప్పటివరకు ఎన్నో కోర్టు రూమ్ డ్రామాలు తెరకెక్కాయని అవి అన్నీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయని చెప్పారు. కోర్టుకు సంబంధించిన కథలు రాయాలనుకునే వారు ‘ఒక్కడు చాలు’ సినిమా చూడాలని (Paruchuri Gopala Krishna) పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!