విడుదలైనప్పుడు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా… తర్వాత భారీ విజయం (?) అందుకున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. సరికొత్త మహేష్‌ను అభిమానులకు పరిచయం చేసిన చిత్రమిది. లుక్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రజెన్స్.. ఇలా ఎందులో చూసినా కొత్త మహేష్‌ను చూపించారు. వసూళ్ల విషయంలో చిత్రబృందం భారీ లెక్కలే చెప్పింది. అయితే ట్రేడ్ పండితులు మాత్రం వేరే లెక్క చెప్పారు. ఈ విషయం పక్కన పెడితే.. సినిమాను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పోస్ట్‌మార్టమ్ చేశారు.
సినిమా ఇంకా బాగా ఆడి ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. సమాజంలోని ఆర్థిక సంబంధిత అంశాలు కథా నేపథ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు పరశురామ్. సినిమాలో చిన్నపాటి మార్పులు చేసుంటే మరింత పెద్ద హిట్టయ్యేదని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. సినిమా ప్రథమార్ధంలో మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ మధ్య సాగిన వినోదాత్మక సన్నివేశాలు ఇంకొన్ని ఉండుంటే సినిమా ఇంకా అదరగొట్టేదని గోపాలకృష్ణ అన్నారు.
సరదాగా సాగిపోతున్న కథనంలో ఒక్కసారి సీరియస్ సన్నివేశాలు వచ్చాయని, అలా కాకుండా ఇంకాస్త వినోదాత్మకంగా కథను నడిపి, ఆ తర్వాత మహేష్ ఇండియాకు వచ్చేలా రాసుకుని ఉంటే బాగుండేది అని చెప్పారు. కళావతి డబ్బులు ఇవ్వకుండా, తండ్రితో వార్నింగ్ ఇప్పించడంతో మహేశ్ ఇండియాకి వెళ్తాడు. ఆ సీన్స్ ఇంకాస్త ఆలస్యంగా వస్తే బాగుండేది అనేది పరుచూరి గోపాలకృష్ణ ఉద్దేశం. సినిమాల్లో కథనం అలా హఠాత్తుగా మారిపోవటం సినిమా కథా గమనానికి ఇబ్బంది పెట్టింది అని చెప్పారు.
విలన్‌కీ, హీరోకి మధ్య జరిగే సన్నివేశాలనే చూపిస్తే ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తారని చెప్పిన గోపాలకృష్ణ.. ‘సర్కారు వారి పాట’లో ఇదే జరిగింది అని చెప్పారు. హీరో, హీరోయిన్ల మధ్య కామెడీ, సీరియస్ రొమాన్స్‌ని కొనసాగించి ఉంటే ఈ చిత్రం మరో రూ. వంద కోట్లు వసూలు చేసేదని చెప్పారాయన. సినిమాకు రూ. 200 కోట్లు వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఆ లెక్కన పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన సూచనలు కూడా సినిమాలో ఉండుంటే రూ. 300 కోట్లు వచ్చేవి అన్నమాట.
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!