సినిమాలపై తరచూ తన పంచనామాను చేస్తుంటారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి పాఠాలు అంటూ తాజాగా ‘సీతా రామం’ సినిమా గురించి మాట్లాడారు. హృద్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘సీతా రామం’. ఈ సినిమా తీసిన దర్శకుడు హను రాఘవపూడికి… నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌కు మంచి పేరే వచ్చింది. అయితే సినిమాలో ఈ మార్పులు చేసి ఉంటే ఇంకా బాగుండేది అంటూ కొన్ని ఆలోచనలు పంచుకున్నారు పరుచూరి గోపాలకృష్ణ.
ఆకట్టుకునే యుద్ధ నేపథ్యం, విభిన్న పార్శ్వాలను స్పృశించిన ప్రేమ, విషాదాంతం లాంటి అంశాలు సినిమాను మరుపురాని చిత్రంగా నిలబెట్టాయి అని పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి వివరించారు. అంతేకాదు గతంలో ఇలాంటి నేపథ్యంతోనే వచ్చిన కొన్ని సినిమాలు.. ప్రేక్షకులను ఆకట్టుకుని, కమర్షియల్‌గానూ విజయం సాధించాయని గుర్తు చేశారు. షారుఖ్ ఖాన్, ప్రీతీ జింటా, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వీర్ జారా’ది కూడా ఇదే కథాంశం అని పరుచూరి చెప్పుకొచ్చారు.
అయితే సగటు ప్రేక్షకుడు ఆశించే విధంగా సినిమాకు సుఖాంతం ఇవ్వకుండా, విషాదాంతంగా ముగించడంతో ‘సీతారామం’ భిన్నమైన ప్రేమకథ చిత్రంగా నిలిచిందన్నారు. క్లైమాక్స్‌లో ఇద్దరూ కలిసినట్లు చూపించి ఉంటే సినిమా ఫలితం వేరే లెవెల్లో ఉండేదని చెప్పారు. హీరో పాత్రను ప్రశ్నార్థకంగా ముగించేయడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసి కంటతడి పెట్టించిందని పరుచూరి వివరించారు. చక్కని ప్రేమకావ్యం తీయడంలో దర్శకుడు హను రాఘవపూడి చక్కటి ప్రతిభ కనబరిచారని పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసించారు.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన తమ నటనతో సినిమాను రక్తి కట్టించారని పరుచూరి గోపాలకృష్ణ తన వీడియోలో మెచ్చుకున్నారు. సినిమా నిర్మాణలో ఏ మాత్రం రాజీపడకుండా తక్కువ నిడివి ఉన్న పాత్రలకు కూడా అగ్ర నటులను తీసుకున్నారని.. ఇది మెచ్చుకోదగ్గర అంశమని చెప్పారు. అలాగే ఉన్నత విలువలతో ‘సీతారామం’ ను నిర్మించిన అశ్వనీదత్, ఆయన కుమార్తెలను అభింనదించాల్సిందే అని పరుచూరి వీడియోను ముగించారు.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!