కొన్నేళ్ల క్రితం వరకు ఇతర భాషల్లో హిట్టైన సినిమాలు తెలుగులో రీమేకై ఇక్కడ కూడా ఘనవిజయం సాధించాయి. అయితే గత కొన్నేళ్ల నుంచి రీమేక్ సినిమాలు తెలుగులో ఎక్కువగా హిట్ కావడం లేదు. స్టార్ హీరోలు సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటే ప్రేక్షకులు ముందుగానే ఆ సినిమాలను ఇతర భాషల్లో చూసేస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన 96 సినిమాను తెలుగు ప్రేక్షకులు చూడటంతో 96 రీమేక్ జాను తెలుగులో ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ సినిమాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా గోపాలకృష్ణ వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడుతూ పింక్, నేర్కొండ పారవై సినిమాలను ఇప్పటికే కొన్ని కోట్ల మంది యూట్యూబ్ లో చూసేశారని చెప్పారు.
ప్రేక్షకులు చూసిన సినిమాను మళ్లీ తెలుగులో వకీల్ సాబ్ పేరుతో తీసి తెలుగులో అద్భుతంగా ఆడించారని గోపాలకృష్ణ పేర్కొన్నారు. అంత పవర్ ఉంది కాబట్టే ఆయన పవర్ స్టార్ అయ్యారని గోపాలకృష్ణ వెల్లడించారు. ప్రేక్షకులకు ఈ సినిమా కథ ముందే తెలిసినా పవన్ కళ్యాణ్ కోసం ఈ సినిమాను మళ్లీ చూశారని కానీ ఈ సినిమా థియేటర్లలో ఉన్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ వల్ల కేసులు పెరిగాయని గోపాలకృష్ణ తెలిపారు. వకీల్ సాబ్ మూవీ జనవరిలో రిలీజై ఉంటే కలెక్షన్లు మరో విధంగా ఉండేవని గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!