అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో ‘పరుగు’ (Parugu) సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో షీలా హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2008 మే 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదట్లో ఈ సినిమాకి హిట్ టాక్ రాలేదు.యావరేజ్ రిపోర్టులే వచ్చాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘జల్సా’ (Jalsa) సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న రోజులు అవి. అయినప్పటికీ ఈ సినిమా స్లోగా పికప్ అయ్యి బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.
దేశముదురు (Desamuduru) తర్వాత అల్లు అర్జున్ నుండీ వచ్చిన సినిమా ఇది. మాస్ ఆడియన్స్ మొదట్లో దీనిని అందుకే యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు. సమాజంలో లేచిపోయి పెళ్లి చేసుకుంటున్న యువత తీరు, వారి తల్లిదండ్రుల ఆవేదన ప్రదానంగా ఈ సినిమా రూపొందింది. సినిమాలో ఒక సీన్ ఉంటుంది. క్లైమాక్స్ లో నీలకంఠం ( ప్రకాష్ రాజ్) పెద్ద కూతురు ఆచూకీ తండ్రికి తెలుస్తుంది.
ఆమె ఎదుట ప్రేమికుడుని కొడుతుంటే.. తండ్రికి ఎదురు తిరుగుతుంది ఆ పెద్ద కూతురు. ఈ క్రమంలో ఆమె తండ్రితో పలికిన డైలాగ్స్ , తర్వాత ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ అన్నీ హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఇలాంటి సీన్ ఒకటి తమిళనాడులో నిజంగా జరిగింది. తండ్రి వద్దు అని చెప్పినా కూతురు అతన్ని వెనక్కి నెట్టి ప్రేమికుడితో వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన వీడియోని మీరు కూడా ఒక లుక్కేయండి.
Heart Breaking
కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొదని ప్రద్యేయ పడుతున్న తండ్రి..pic.twitter.com/tJJMBMaNTe
— Filmy Bowl (@FilmyBowl) March 22, 2025