Naresh,Pavitra Lokesh: రమ్య – పవిత్ర ల మధ్య వివాదం మరింత ముదిరేలా ఉందిగా

నరేష్ – పవిత్రా ల వ్యవహారం అందరికీ తెలిసిందే. గత 4 ఏళ్ళుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. దాన్ని అందరూ సహజీవనం అంటున్నారు. వాళ్ళు మాత్రం స్నేహితులు అంటున్నారు. అయితే స్ట్రింగ్ ఆపరేషన్లో పవిత్రా లోకేష్ … నరేష్ తో కలిసి ఉంటున్నాను అని చెప్పకనే చెప్పింది. ఇదిలా ఉండగా.. నరేష్ – పవిత్ర లోకేష్ ల పై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తుంటాయి. అయితే మొదట్లో వీటిని పవిత్ర పట్టించుకోలేదు.

కానీ ఇటీవల ఈమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించినప్పుడు పవిత్ర – లోకేష్ లు బాగా హర్ట్ అయ్యారు. అదే టైంలో నరేష్ మూడో భార్య రమ్య కూడా హాజరైంది. దీంతో పవిత్ర పై మరింతగా ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్ వెనుక రమ్య ఉందని పవిత్ర భావించినట్టు ఉంది. అందుకే ట్రోలర్స్ పై మాత్రమే కాకుండా రమ్య పై కూడా ఈమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పవిత్ర ఈ విషయం పై స్పందిస్తూ..‘నా పరువుకు భంగం కలిగేలా రమ్య వ్యవహరిస్తుంది . నా వ్యక్తిగత జీవితాన్ని రమ్య టార్గెట్ చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ను అడ్డుపెట్టుకుని నన్ను కించపరుస్తుంది . నా పై జరుగుతున్న ట్రోలింగ్ వెనుక ఆమె హస్తం ఉంది… గతంలో కూడా రమ్య నాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు… రమ్య,నరేశ్ మధ్య కుటుంబ వివాదాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన సంగతే. రమ్య ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది….

నరేష్ పై అలాగే నాపై పలు అభ్యంతర వీడియోలు చేయిస్తుందామే అనేది నా అనుమానం’ అంటూ పవిత్ర ఫిర్యాదులో పేర్కొంది. ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే రమ్య .. పవిత్ర – నరేష్ ల గురించి ఇప్పుడు పెద్దగా ఆలోచించడం లేదు అన్నది కన్నడ మీడియా సమాచారం. మరి ఇలాంటి టైంలో రమ్యని కెలకడం ఎందుకు అన్నది అందరి అభిప్రాయం.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus