Pavitra Lokesh: వామ్మో ఒక్క రోజు షూటింగ్ కోసం పవిత్ర లోకేష్ అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..!

టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో పవిత్ర లోకేష్ ఒకరు. తాజాగా ఆమె రెమ్యూనరేషన్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో కన్నడ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా నటించింది పవిత్ర లోకేష్. తర్వాత అక్క, వదిన, తల్లి క్యారెక్టర్స్ పోషించింది. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగుతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా రాణిస్తుంది. ఇక టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్, పవిత్రల డేటింగ్ అప్పట్లో ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. వీరి పెళ్లికి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అడ్డంకిని సృష్టించిందని వార్తలు వెదజల్లాయి. అంతేకాదు బెంగళూరులోని ఓ హోటల్ లో వీరిద్దరూ స్టే చేయడం.. అప్పుడు నరేష్ మూడో భార్య రమ్య అక్కడికి వెళ్లి రచ్చ రచ్చ చేయడం మనం టీవీల్లో చూశాం కూడా. అనంతరం లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ నరేష్, పవిత్ర తమ ప్రేమని బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అప్పటినుంచే ఈ జంటకు టాలీవుడ్ స్టార్స్ రేంజ్ పాపులారిటీ వచ్చింది.

ఈ గొడవల అనంతరం పవిత్ర (Pavitra Lokesh) పాపులారిటీ పీక్ స్టేజుకు చేరింది. పవిత్ర తమ సినిమాలలో నటిస్తే.. మంచి క్రేజ్ వస్తుందని నమ్మి తక్కువ బడ్జెట్లో సినిమా తీసే వాళ్లకు ఆమె బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో పవిత్రకు చేతినిండా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవిత్ర రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి.

పవిత్ర గతంలో ఒక్కరోజుకు రెమ్యునరేషన్ గా రూ.50వేల వరకు తీసుకుంటుందట. అయితే నరేష్ తో తన అనుబంధం బలపడిన తరువాత రెమ్యూనరేషన్ ను డబుల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక రోజు కాల్షిట్ కి లక్ష రూపాయలు చార్జ్ చేస్తుందట. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు సైతం ఆమెకు అడిగినంత ఇస్తున్నారట. లేటు వయసులో ఘాటు ప్రేమకు ఎంత క్రేజ్ వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus