ఇది ‘పవర్ స్టార్’ రేంజ్ అంటే..!

మొన్నటి వరకూ సినిమాలు చేయను అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో అభిమానులు తీవ్ర నిరాశతోనే ఉంటూ వస్తున్నారు. అయితే అన్నయ్య చిరంజీవి ఒత్తిడి చేయడంతో రాజకీయ జీవితానికి కూడా పనికొచ్చే సినిమా చేస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి కథ ఏ దర్శకుడు తయారుచేస్తాడు అనే సందేహం అందరిలోనూ నెలకొంది. పలువురు దర్శకులు పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా ‘ఎం.సి.ఏ’ ఫేమ్ వేణుశ్రీరాం ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను దిల్ రాజు నిర్మించబోతున్నాడట. బాలీవుడ్ లో అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘పింక్’ కు ఇది రీమేక్ అని తెలుస్తుంది. ఫైనల్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాదు ఈ చిత్రం కోసం పవన్ ఏకంగా 40 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట. ఇక 25 రోజులు కాల్ షీట్లు ఇచ్చినట్టు కూడా సమాచారం. ఎందుకంటే ఇది ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని 40 రోజుల్లో ఫినిష్ చేశారు. సో విడుదల కూడా త్వరగా అయ్యే అవకాశం ఉంటుందన్న మాట. మరి ‘అత్తారింటికి దారేది’ తరువాత హిట్ లేని.. పవన్ కళ్యాణ్ కు ‘పింక్’ సినిమా హిట్టొస్తుందేమో చూడాలి..!

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus