Pawan Kalyan: హిమాలయాలకు వెళతావా ఏంటీ.. పవన్ తో మోదీ!!

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకార వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. వేడుక ముగిసిన తర్వాత పవన్ బయటకు వస్తున్న సమయంలో, మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టారు. “మోదీ గారు మీతో ఏమన్నారు?” అనే ప్రశ్నకు పవన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పవన్ చెప్పినదాని ప్రకారం, మోదీ గారు నవ్వుతూ “ఏం పవన్ గారూ, ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదాం అనుకుంటున్నారా?” అని చమత్కరించారు.

Pawan Kalyan

దానికి పవన్ కూడా నవ్వుతూ “ఇంకా చాలా సమయం ఉంది. ముందు ఇవన్నీ చూసుకోవాలి” అని బదులిచ్చినట్లు తెలిపారు. ఈ మాటలు చెప్పినప్పుడు మోదీ, పవన్ ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడటం వేదికపై అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం ప్రస్తావించగా, పవన్ తన అభిప్రాయం వెల్లడించారు. “ఇది చారిత్రక విజయం. మోదీ నాయకత్వం, దేశ ప్రజల నమ్మకానికి గట్టి నిదర్శనం.

ఢిల్లీలో బీజేపీకి తిరిగి అధికారం దక్కడం సాధారణ విషయం కాదు” అని పవన్ వ్యాఖ్యానించారు. సాధారణంగా, రాజకీయ నేతల మధ్య ఇలాంటి అనధికారిక సంభాషణలు ఎక్కువగా బయటికి రావు. కానీ, పవన్ ఈ విషయాన్ని ఎంతో సరళంగా, హాస్యభరితంగా వివరించడం అందరికీ ఆసక్తిని కలిగించింది. హిమాలయాల ప్రస్తావనతో ప్రారంభమైన ఈ చిన్న సంభాషణ, మోదీ – పవన్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా హైలైట్ చేసిందని చెప్పాలి. ఇక పవన్ నెక్స్ట్ హరహర వీరమల్లు  (Hari Hara Veera Mallu) సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

 ‘డాకు మహారాజ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus