Pawan, Sai Tej: వినోదాయ సిత్తం రీమేక్ లో సాయితేజ్ ను అలా చూపిస్తారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో వినోదాయ సిత్తం రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సముద్రఖని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. జులై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలల క్రితం యంగ్ హీరో సాయితేజ్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే.

బైక్ పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చాలామంది భావించారు. వినోదాయ సిత్తం రీమేక్ లో కూడా ఇలాంటి సీన్ ఉంది. ఒరిజినల్ లో కారులో ప్రమాదం జరిగినట్టు చూపించగా రీమేక్ లో మాత్రం బైక్ పై వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్టు చూపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భగవంతుడిగా కనిపించనున్నారు. వినోదాయ సిత్తం రీమేక్ కు సంబంధించి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక మార్పులు చేశారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ తన పేరును వేసుకుంటారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ భార్య కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోనున్నారు. పవన్ రీఎంట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటుండగా ఈ సినిమాతో పవన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నటుడిగానే కాకుండా దర్శకునిగా కూడా సముద్రఖనికి మంచి గుర్తింపు ఉంది. సముద్రఖని తన తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరగానే పూర్తవుతుందని వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus