Pawan Kalyan, Anushka: పవన్ – అనుష్క కలిసి నటించకపోవడానికి అసలు కారణం అదేనా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – అనుష్కశెట్టి సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేశారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒక్కటంటే ఒక్క సినిమా చేయలేకపోయారు . వీళ్లిద్దరు హైట్ కి వెయిట్ కి బాగా మ్యాచ్ అవుతుందని ..కలిసి నటిస్తే చూడాలి అన్నది ఫ్యాన్స్ కోరిక. గతంలో వీళ్లిద్దరితో ఓ ప్రముఖ దర్శకుడు సినిమా తీయనున్నారని వార్తలు వచ్చాయి. ఓ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ పాత్ర కోసం అనుష్కను తీసుకున్నట్టు ఇండస్ట్రీ టాక్ వినిపించింది.

వీడియో కాల్ ద్వారా ఆమెకు స్క్రిప్ట్ వినిపించారని.. అది నచ్చడంతో అనుష్క పచ్చజెండా ఊపారని అన్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. దానికి అసలు కారణమేంటి.. ఎందుకు క్యాన్సిల్ అయిందో ఇప్పుడు చూద్దాం.. పవన్ కళ్యాణ్ కెరియర్ లోని ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా అన్నవరం . సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది.

కానీ పవన్ కళ్యాణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది అసిన్. అయితే మొదటగా ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క శెట్టి ని అనుకున్నారట మేకర్స్ . అయితే అప్పటికే స్టాలిన్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో.. మన సినిమాలో ఇలాంటి అమ్మాయి వద్దు అంటూ మేకర్స్ రిజెక్ట్ చేసారట . అలా అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఆ తర్వాత సెట్ అవ్వనే లేదు ..ఇక భవిష్యత్తులో కుదురుతుంది అన్న నమ్మకాలు లేవు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తో పాటు OG మూవీ కూడా షూటింగ్ వేగంగా చేస్తున్నారు. హరి హర వీరమల్లు షూటింగ్ చివరి దశలో ఉంది. మేనల్లుడుతో కలిసి నటించిన చిత్రం బ్రో..సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు అలాగే అనుష్క మిస్ శెట్టి..పోలిశెట్టి సినిమాతో అభిమానుల ముందుకు రాబోతోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus