Pawan Kalyan: ఏంటీ.. పవన్ ఆ సినిమాకు 170 కోట్లు తీసుకున్నాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న లైనప్ లో ఉన్న వాటిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఒకటి. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై, కొంత భాగం పూర్తయింది. అయితే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమాల షూటింగ్‌కు సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో ‘హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu), ‘ఓజి’ (OG Movie), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల షూటింగ్‌లు కాస్త ఆలస్యమవుతున్నాయి.

Pawan Kalyan

‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh)  తర్వాత హరీష్ శంకర్‌తో పవన్ కలయికలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ లుక్‌, టైటిల్ పోస్టర్‌ వచ్చినప్పటి నుంచీ బజ్ మామూలుగా లేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ రూ.170 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఓ రేంజ్ లో టాక్ నడుస్తోంది.

నిజానికి పవన్ సినిమాలు ఇంతవరకు బాక్సాఫీస్ వద్ద కనీసం 150 కోట్ల షేర్ మార్క్ ను కూడా అందుకోలేదు. అలాంటిది 170 కోట్లు ఇస్తున్నారా అనేది అసలు డౌట్. పవన్ రెమ్యునరేషన్ లెక్క దాదాపు 70 కోట్ల వరకు ఉంటుందనేది ఇండస్ట్రీలో బలమైన టాక్. కానీ ఈ సినిమాకు డబుల్ అవ్వడం అనేది నమ్మశక్యంగా లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా పవన్ సినిమా కోసం ఎలాంటి కాంప్రమైజ్ చేయడం లేదు. షూటింగ్ పూర్తి చేసిన వెంటనే 2026లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కెరీర్‌లో ఈ సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంటుందని, ఫ్యాన్స్‌కు మళ్లీ గబ్బర్ సింగ్ స్టైల్ వినోదాన్ని అందిస్తుందని దర్శకుడు హరీష్ శంకర్ నమ్మకం వ్యక్తం చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus