Pawan Kalyan: 2019 ఎన్నికల ఫలితాలపై పవన్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయగా రెండు స్థానాలలో ఆశించిన ఫలితాలు రాలేదనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కనీసం ఒక స్థానంలో కూడా గెలవకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది. నీతి, నిజాయితీగా రాజకీయాలు చేయడంతో పాటు ఓటర్లకు డబ్బులు పంచకపోవడం పవన్ కళ్యాణ్ గెలుపుపై ప్రభావం చూపిందని కామెంట్లు వినిపించాయి. అయితే 2019 ఎన్నికల ఫలితాల గురించి తాజాగా పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్లు చేశారు.

వారాహి యాత్రలో భాగంగా పవన్ మాట్లాడుతూ రెండు చోట్ల ఓడిపోతే గుండె కోసేసినట్లు అయ్యిందని చెప్పుకొచ్చారు. అవినీతి పరులను గెలిపించి నన్ను గెలిపించలేదని అనిపించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గం ఇదేనంటూ వేర్వేరు నియోజకవర్గాల గురించి ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు పవన్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

పవన్ (Pawan Kalyan) కాంబినేషన్ లేని సీన్లను ప్రస్తుతం సుజీత్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. సాహో సినిమాతో ఆశించిన ఫలితాలను అందుకోని సుజీత్ ఓజీ సినిమాతో మాత్రం సత్తా చాటుతానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. బాక్సాఫీస్ ను ఈ సినిమాతో కచ్చితంగా షేక్ చేస్తానని సుజీత్ భావిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

వరుస విజయాలతో జోరుమీదున్న దానయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పవన్ వరుస సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి పవన్ కోరుకున్న విజయాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కు 2024 ఎన్నికల్లో సైతం అనుకూల ఫలితాలు రావాలని అభిమానులు మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus