Pawan Kalyan: రాజకీయాల విషయంలో పవన్ నిర్ణయమిదే.. ఏం జరిగిందంటే?

  • July 11, 2023 / 12:40 AM IST

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ మరో 20 రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. మై డియర్ మార్కండేయ ఫస్ట్ లిరికల్ కు ఇప్పటివరకు 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సాంగ్ ఎంతగానో నచ్చింది. మరోవైపు పవన్ వారాహి యాత్రతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ యాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంటారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా పొత్తుల గురించి మరోమారు స్పందిస్తూ పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. పొత్తుల గురించి మాట్లాడితే చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ ఈ విషయాలను వెల్లడించారు.

ఇది పొత్తుల గురించి మాట్లాడే టైం కాదని సరైన సమయం వస్తే పొత్తుల గురించి స్పందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఫీడ్ బ్యాక్ తీసుకుని పొత్తుల విషయంలో ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బ్రో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారా? లేదా? అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. బ్రో సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా పవన్, సాయితేజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్, సాయితేజ్ లను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus