Pawan Kalyan: టాలీవుడ్ హీరోలంటే ఇష్టం.. పవన్ కామెంట్స్ వైరల్!

  • June 17, 2023 / 05:34 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే అరుడజను సినిమాలను చేతిలో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమా షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు వారాహి యాత్ర చేస్తూ రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ జూన్ 16వ తేదీ కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు.

ఈ యాత్రలో భాగంగా పెద్ద ఎత్తున యువతి యువకులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ యువతను ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. సినిమా వేరు… రాజకీయం వేరు యువత సినిమాల పరంగా ఏ హీరో నైనా ఇష్టపడవచ్చు. ఏ హీరోల సినిమాలైనా చూడవచ్చు కానీ రాజకీయాల విషయానికి వస్తే ఇలా ఆలోచించడం సరికాదు.

రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలి అంటే సరైన నాయకుడిని ఎన్నుకునే విషయంలో యువత తప్పనిసరిగా ఆలోచించాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక టాలీవుడ్ హీరోల గురించి కూడా మాట్లాడుతూ తనకు కూడా తోటి నటీనటులు అంటే చాలా ఇష్టం వారు నటించిన సినిమాలను కూడా నేను చూస్తాను తనకు రామ్ చరణ్, చిరంజీవి అంటే చాలా ఇష్టమని తెలియజేశారు.

అంతేకాకుండా ప్రభాస్ ఎన్టీఆర్ అంటే కూడా చాలా ఇష్టమని వారి సినిమాలను కూడా నేను చూస్తానని, వారంటే నాకు చాలా గౌరవం అంటూ ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోల గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus