నటుడిగా 21వ వసంతంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో క్రేజీ హీరో పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా, కళ్యాణ్ బాబు గా పరిచయమైన ఈ నటుడు అతి తక్కువ కాలంలోనే పవర్ స్టార్ గా ఎదిగారు. 1996 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే సినిమాతో కెమెరా ముందుకు వచ్చిన పవన్ సుస్వాగతం సినిమాతో యువతకు చేరువయ్యారు. తొలిప్రేమతో అభిమాన హీరోగా మారిపోయారు. అప్పటి నుంచి పవన్ కాలేజీ కుర్రోలందరికీ  ఐకాన్ గా అయ్యారు. అప్పటి నుంచి సినిమాకి సినిమాకి రేంజ్ పెంచుకుంటూ వచ్చారు. తమ్ముడు, బద్రి, ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా ఏడు హిట్లు సాధించిన హీరోగా పవన్ రికార్డు నెలకొల్పారు.

ఒక స్టార్ హీరో అయి ఉండి టెక్నీషియన్ గా అవతరమెత్తి జానీ తెరకెక్కించారు. ఇది ఫెయిల్ అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తన కెరీర్ లో విజయాలతో అపజయాలను చవిచూసిన ఈయన గబ్బర్ సింగ్ తో పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. అత్తారింటికి దారేది మూవీతో కలక్షన్ల సునామీ సృష్టించారు. ప్రస్తుతం నటుడిగా 20 పూర్తిచేసుకొని 21 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భం గా ఫిల్మీ ఫోకస్ ఆయనకు శుభాకాంక్షలు తెలియ జేస్తోంది. పవన్ నటించిన కాటమరాయుడు సూపర్ హిట్ కావాలని కోరుకుంటోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus