సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ (Allu Arjun) టీం అలాగే అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోలీసుల నుండి సరైన పర్మిషన్ తీసుకోకుండా పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేస్ కి వెళ్లి, తొక్కిసలాటకు అలాగే ఓ మహిళ మృతికి కారణమైనందున అల్లు అర్జున్ పై కేసు నమోదవ్వడం జరిగింది. దీనిపై అల్లు అర్జున్ లాయర్ కౌంటర్ దాఖలు చేసినప్పటికీ.. రూల్స్ ప్రకారం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకుని విచారణకి తీసుకెళ్లడం జరిగింది.
Pawan Kalyan
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఉస్మానియా ఆస్పత్రికి అల్లు అర్జున్ ని తీసుకెళ్లి మెడికల్ టెస్టులు వంటివి కూడా నిర్వహించారట పోలీసులు. ఇక విషయం తెలుసుకున్న వెంటనే.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ మామ… కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే.. ఈరోజు ఏపీ డెబ్యూటీ సీఎం (Pawan Kalyan) ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక ట్వీట్ పడింది.
అందులో ‘ఐకమత్యమే బలం, విడిపోతే పతనం’ అనే మీనింగ్ వచ్చేలా లైన్ ఉంది. దీనిని అల్లు అర్జున్ అరెస్ట్ కి రిలేట్ చేసుకుంటున్నారు పవన్, అల్లు అర్జున్ అభిమానులు. వాస్తవానికి ఆ ట్వీట్.. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ మీట్ కొరకు ఏపీ డెబ్యూటీ సీఎం ట్విట్టర్ అకౌంట్ నుండి వేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ కావాలని అలా ట్వీట్ చేసినట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏదేమైనా ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుండటం గమనార్హం.