స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. పవన్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా పవన్ వ్యక్తిత్వానికి కూడా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. చేసిన సహాయాలను చెప్పుకోవడానికి ఇష్టపడని అతికొద్ది మంది స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కొరకు ఖర్చు చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం తెలంగాణలో చిన్నారి చైత్ర హత్యాచార ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నారి చైత్ర కేసులో నిందితుడైన రాజు రైలు ప్రమాదంలో మృతి చెందాడు. చైత్ర కుటుంబం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదని గతంలో వార్తలు వచ్చాయి. అయితే చైత్ర కుటుంబానికి పవన్ 2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంను అందజేశారు. జనసైనికులతో చైత్ర తల్లిదండ్రులను కలిసిన పవన్ కళ్యాణ్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ రెండు సినిమాలు తెరకెక్కుతుండగా ఈ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. వచ్చే ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. జనసేన పార్టీ తెలంగాణ ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా పవన్ ఆర్థిక సహాయానికి సంబంధించిన ప్రకటన వెలువడింది.
చిన్నారి చైత్రకు జరిగిన దారుణ ఘటనకు సంతాపం తెలియజేస్తూ 2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చైత్ర తల్లిదండ్రులకు అందజేసి జనసైనికులతో కలిసి 2 నిమిషాల మౌనం పాటించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#JanaSenaTelangana