జనసేనాని పవన్ కళ్యాణ్ మరో మారు తన ఔదార్యం చాటుకున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి భారీ విరాళం ప్రకటించారు. పవన్ నేడు ఉదయం ట్విట్టర్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ రిలీఫ్ ఫండ్ కి 50 లక్షలు ప్రకటించిన ఆయన మరో 50 లక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేయడం జరిగింది.
అలాగే మరో కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి సాయంగా ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దేశంలో రోజు రోజుకు కరోనా భాదితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలకు మద్దతుగా, కరోనా పై యుద్ధంలో భాగంగా సినీ తారలు, సెలెబ్రిటీలు మరియు వ్యాపార వేత్తలు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రెండు కోట్ల భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.
పవన్ ఔదార్యానికి అటు ఫ్యాన్స్ మరియు ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. వేసవి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. Most Recommended Video