పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ ప్రేక్షకులు భావించిన విధంగా ఈ నెల 12వ తేదీన విడుదలై ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈపాటికి సంతోషంగా ఉండేవారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నిర్మాతల వల్ల భీమ్లా నాయక్ నిర్మాతలు సినిమాను వాయిదా వేయడం ఆ తర్వాత ఆ సినిమాల రిలీజ్ డేట్లు కూడా మారడం జరిగిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి ప్రేక్షకులకు బంగార్రాజు మాత్రమే ఏకైక ఆప్షన్ గా మిగిలింది.
రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి, హీరో సినిమాలు విడుదలవుతున్నా ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. 2021 సంవత్సరంలా 2022 సంవత్సరం సంక్రాంతి సీజన్ కూడా పెద్ద సినిమాలకు ఉపయోగకరంగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో కరోనా ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ గురించి జగన్ సర్కార్ ప్రకటన చేసి ఆ తర్వాత ఆ ప్రకటన విషయంలో వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. బంగార్రాజు సినిమా కోసమే జగన్ సర్కార్ నిర్ణయాన్ని మార్చుకుందని కామెంట్లు వినిపించాయి.
థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు సైతం ఏపీలో జనవరి 18వ తేదీ తర్వాత అమలులోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే పవన్ అభిమానులు మాత్రం సంక్రాంతికి భీమ్లా నాయక్ విడుదలై ఉంటే ఇదే పరిస్థితి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు. భీమ్లా నాయక్ రిలీజై ఉంటే థియేటర్లలో కఠిన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూ అమలు చేసేవారని పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సినిమాల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
బంగార్రాజు సినిమా వచ్చే నెల 25వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కరోనా కేసులు తగ్గకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో ఆ సినిమా నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఏపీలో పుష్ప, అఖండ బ్రేక్ ఈవెన్ కాకపోవడంతో బంగార్రాజు అయినా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!