Bro Teaser: బ్రో టీజర్ గురించి పవన్ అభిమానుల కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ సైతం బ్రో టీజర్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఈ టీజర్ కు మిలియన్ల వ్యూస్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బక్రీద్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ టీజర్ తమకు ఎంతగానో నచ్చిందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

టీజర్ లో డైరెక్టర్ సముద్రఖని వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూపించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “చూస్తాం చూస్తాం సినిమాలు ఎక్కువగానే చూస్తాం ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాం జై పవన్ కళ్యాణ్” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ టీజర్ తో పవన్ ట్రెండ్ సెట్ చేశారని మరి కొందరు చెబుతున్నారు. మా ఊహల కంటే టీజర్ బాగుందని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు.

ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం బ్రో మూవీ భాషతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించాలని కామెంట్లు చేస్తున్నారు. పవన్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు మా కడుపు నిండిపోతుందంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. టీజర్ లేట్ అయినా లేటెస్ట్ గా ఉందని మరి కొందరు చెబుతున్నారు. మరో నెల రోజుల్లో బాక్సాఫీస్ షేక్ అవుతుందని ఇందుకు సంబంధించి సందేహాలు అవసరం లేదని పవన్ ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు.

(BRO) బ్రో సినిమా రిలీజ్ తర్వాత బ్రో అనే వర్డ్ మరింత పాపులర్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు బిజినెస్ ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బ్రో కమర్షియల్ గా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్రో సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus