కరోనా పరిస్థితుల నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ను ఇప్పుడు రిలీజ్ చేస్తారా? లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. ‘భీమ్లా…’ సినిమాను వాయిదా వేయించడం ఆ తర్వాత, ఏ సినిమా కోసం ఇదంతా చేశారో ఆ సినిమాలు కూడా వాయిదా పడటం చూసి దిల్ రాజు మీద పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దిల్ రాజు మీద కోపం ప్రదర్శిస్తున్నారు. అంతా ఓకే సంక్రాంతికి పవన్ కల్యాణ్ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే… ఇలా చేశారేంటి అని బాధపడిపోతున్నారు.
సంక్రాంతి సినిమాల పంచాయతీ గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. తొలతు సంక్రాంతి డేట్ ప్రకటించిన సినిమాలు ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’, ‘రాధేశ్యామ్’. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను జనవరి 7కు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పరిశ్రమ శ్రేయస్సు అనే పేరుతో ‘సర్కారు వారి పాట’ విడుదల వాయిదా వేశారు. ఏప్రిల్‌కి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత నిర్మాతల గురి ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాను కూడా వాయిదా వేయించి… సంక్రాంతి ఫెస్టివల్‌కు రెండు పాన్ ఇండియా సినిమాలే ఉండేలా చూసుకున్నారు.
‘భీమ్లా నాయక్’ వాయిదా విషయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘రాధేశ్యామ్’ నిర్మాతలు ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ… దిల్ రాజు మాత్రం చాలా కష్టపడ్డారు అంటారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున ఆయన పెద్దరికం తీసుకున్నారు. అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉంది. అదే ఆ రెండు పాన్ ఇండియా సినిమాలను ఆయనే రిలీజ్ చేస్తుండటం. ఈ కారణంగానే పవన్‌ను ప్రత్యేకంగా కలసి ఒప్పించి మరీ ‘భీమ్లా నాయక్’ వాయిదా వేయించారు. దీంతో పవన్ అభిమానులు ఇప్పుడు దిల్ రాజు మీద గుర్రుగా ఉన్నారు. మీరు ఎవరి కోసం వాయిదా వేయించారో, ఆ సినిమాలే ఇప్పుడు రావడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దిల్ రాజు అప్పుడు ఆ ప్రయత్నం చేయకపోతే… ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ వచ్చేదా? అంటే డౌటనే చెప్పాలి. కారణం ఇప్పుడున్న కరోనా పరిస్థితి. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలు కూడా మొదలవుతున్నాయి. చిన్నగా నైట్ కర్ఫ్యూ అంటూ మొదలై, లాక్‌డౌన్‌కి వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద హీరో సినిమా అంటే కష్టమే అని చెప్పొచ్చు. సో దిల్ రాజు మీద కోపం ఉండొచ్చు కానీ, ఆయనేం చేస్తారు పాపం. అంతా కరోనా ఆడుతున్న ఆట.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!