Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్
- June 11, 2025 / 08:19 PM ISTByPhani Kumar
ఫిబ్రవరిలో పవన్ (Pawan) కుంభమేళాకు వెళ్లారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కూడా పవన్ వెంట వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ స్నానమాచరిస్తుండగా కొంతమంది ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. తర్వాత ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇంకో రకంగా పవన్ (Pawan) ను ట్రోలింగ్ కు గురయ్యేలా చేశాయి అని చెప్పొచ్చు. ఆ ఫోటోల్లో పవన్ కొంచెం పుష్టిగా కనిపించాడు. పొట్ట కొంచెం పెరిగినట్టు, బరువు కూడా పెరిగినట్టు పవన్ కనిపించారు.
Pawan Kalyan
అందువల్ల పవన్ ను కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో బాలయ్య (balaiah) చెప్పిన ‘ఏమయ్యా ఈ పొట్టేసుకునే యుద్దానికి వచ్చేసావా’ అనే టైపులో పవన్ కళ్యాణ్ ను యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం జరిగింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఫిట్ గానే ఉండేవారు.

కానీ రాజకీయాల్లోకి వచ్చాక.. ఆయన టైంకి తినడం లేదు, నిద్రపోవడం లేదు. అందుకే ఫిట్నెస్ పై ఆయన దృష్టి సారించలేకపోయారు. అయితే తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సినిమాల షూటింగుల్లో జాయిన్ అయ్యారు. దీంతో ఫిట్నెస్ పై దృష్టి పెట్టారు.

తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం పవన్ షూటింగ్లో తిరిగి జాయిన్ అయినట్టు.. ఓ వీడియోను వదిలారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఫిట్ గా కనిపించి ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు అని చెప్పాలి. లైట్ కలర్ బ్లూ జీన్స్, థిక్ బ్లూ కలర్ షర్ట్ లో పవన్ కళ్యాణ్ (Pawan kalyan)చూడటానికి యమ స్టైలిష్ గా ఉన్నారు.

















