Pawan Kalyan: ఆ తమిళ సినిమాకు మెయిన్ ఫోకస్ గా మారిన పవన్ కళ్యాణ్
- June 11, 2025 / 07:51 PM ISTByDheeraj Babu
స్టార్ హీరోల ఇమేజ్ ను లేదా వారి తాలుకు ఫ్యాన్స్ ను కొన్ని చిన్న సినిమాల ప్రమోషన్స్ కోసం వాడుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే.. ఓ తమిళ సినిమా విషయంలో మన తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కరాటే గురువు షిహాన్ హుస్సేన్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.
Pawan Kalyan
చెన్నైలో స్థిరపడిన ఆయన పవన్ కళ్యాణ్ కు చిన్నప్పుడు కరాటే నేర్పించడమే కాకుండా ఆయనకి పవన్ కళ్యాణ్ అని పేరు కూడా పెట్టారు అనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే.. వైభవ్, అతుల్య రవి నటించిన తాజా చిత్రం “చెన్నై సిటీ గ్యాంగ్స్టర్” అనే సినిమా జూన్ 20న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో షిహాన్ హుస్సేనీ నటించారు. సినిమాలో ఆయన పాత్ర ఏమిటి అనేది ఇంకా క్లారిటీ లేకపోయినా.. పవన్ కళ్యాణ్ గురువు నటించిన ఆఖరి సినిమా అంటూ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు చిత్రబృందం.

రీసెంట్ గా “పెరుసు”తో మంచి హిట్ కొట్టిన వైభవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. “చెన్నై గ్యాంగ్ స్టర్స్” కూడా చూడ్డానికి మంచి కామెడీ సినిమాలనే ఉంది. బ్యాంక్ లూటీకి పాల్పడే ఓ గ్యాంగ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోందని ట్రైలర్ బట్టి తెలుస్తోంది.

ఇప్పుడు షిహాన్ హుస్సేన్ కారణంగా ఈ చిత్రం చెన్నైలోని తెలుగువాళ్లని కూడా ఆకర్షిస్తోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేదా ఓటీటీకి వచ్చే సమయానికి ఈ క్రేజ్ కచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు మేకర్స్. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం జూన్ 20 వరకు వెయిట్ చేయాల్సిందే.

















