ఆమెకి భయపడే పవన్ కొడుకు అకీరాకు విషెస్ చెప్పలేదా..!
- April 8, 2020 / 05:11 PM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా పుట్టిన రోజు నేడు. 2004 ఏప్రిల్ 8న జన్మించిన అకీరా వయసు ఇప్పుడు 16. పవన్-రేణూ దేశాయ్ ల మొదటి సంతానమే అకీరా నందన్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2000లో వచ్చిన బద్రి సినిమాలో పవన్ రేణు కలిసి నటించారు. అప్పటి వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత వీరు పెళ్లి చేసుకోవడం కొన్నాళ్లుగా జీవిత భాగస్వాములుగా కొనసాగడం జరిగింది. కారణాలేమైనా 2012లో పవన్ రేణూ దేశాయ్ కి విడాకులు ఇవ్వడం జరిగింది.
చట్టబద్ధంగా విడిపోయిన ఈ జంట చాలా కాలంగా విడివిడిగా బ్రతుకుతున్నారు. పవన్ 2013లో తీన్ మార్ సినిమాలో నటించిన అన్నా లెజినోవాను పెళ్లాడారు. కాగా నేడు అకీరా పుట్టిన రోజుకు పవన్ అన్నగారైన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తాను పెద్ద స్టార్ గా ఎదగాలని కోరుకున్నారు. ఐతే సొంత తండ్రి పవన్ మాత్రం అకీరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం సంచలనం రేపుతోంది. పవన్ అకీరాకు పుట్టిన రోజున విషెష్ చెప్పకపోవడం వెనుక కారణం ఏమిటనేది అంతుబట్టడం లేదు.

చాలా కాలం రేణు దేశాయ్ పవన్ పై పరోక్షంగా ఆరోపణలు చేసింది. అసలు పిల్లలతో పవన్ కి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అలాగే విడాకుల తరువాత ఆమెకు ఎదురైన ఆర్ధిక ఇబ్బందులు వంటి విషయాలు కూడా రేణు బహిరంగంగానే చెప్పుకొని బాధపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెకి భయపడే పవన్ కొడుకు అకీరాను సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా విషెష్ చెప్పలేదా అని అనిపిస్తుంది. రాజకీయాలలో ఉన్న పవన్ ఎందుకు రిస్క్ అనుకొని లైట్ తీసుకున్నాడా అనేది తెలియాలి.
Most Recommended Video
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

















