పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ఓకే చెప్పిన సినిమాలలో ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలతో పవన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. అయితే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల జాబితా ఎక్కువగానే ఉంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు.
పవన్ క్రిష్ డైరెక్షన్ లో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సగం పూర్తైంది. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పాటు సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
సముద్రఖని డైరెక్షన్ లో సాయితేజ్ కాంబినేషన్ లో ఒక సినిమాలో, వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో సితార బ్యానర్ లో ఒక సినిమాలో పవన్ నటించాల్సి ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీవీవీ దానయ్య నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు బోయపాటి శ్రీను పవన్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఏడాదిన్నరలో పవన్ రెండు లేదా మూడు సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలం పవన్ రాజకీయాలతో బిజీ కానున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే ఛాన్స్ ఉందని బోగట్టా. ఒక్కో సినిమాకు పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా నుంచి పవన్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.