స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తను సంపాదించే డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారనే సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కళ్యాణ్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కొంతమేర నష్టాలను మిగిల్చినా ఏపీలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండి ఉంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేదని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ క్రికెటర్ కు సహాయం చేసి వార్తల్లో నిలిచారు.
తెలుగు యువకుడు షేక్ రషీద్ భారత అండర్ 19 క్రికెట్ కప్ లో బ్యాట్స్ మెన్ గా, వైస్ కెప్టెన్ గా సత్తా చాటారు. గుంటూరుకు చెందిన ఈ క్రికెటర్ కోసం పవన్ కళ్యాణ్ ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ట్రస్ట్ ద్వారా సాహాయం చేశారు. రషీద్ కు 2 లక్షల రూపాయలు పవన్ ఆర్థిక సహాయం అందించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ తను చేసిన సహాయాలను చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు.
జనసేన పార్టీ నేతలు ఈ ఆర్థిక సహాయాన్ని రషీద్ ను నేరుగా కలిసి అందజేశారని సమాచారం అందుతోంది. పవన్ మంచి మనస్సును నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ ను రషీద్ కలిసే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. యంగ్ టాలెంట్ ను పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తూ ఉండటం గమనార్హం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ప్రతిభ ఉన్న యువతీయువకులను ప్రోత్సహించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
పవవన్ కళ్యాణ్ సముద్రఖని డైరెక్షన్ లో వినోదాయ సిత్తం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు పవన్ హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటారని బోగట్టా.