హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థుల సదస్సు కోసం అమెరికా వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఐదు రోజుల పర్యటన కోసం అక్కడికి వెళ్లిన పవన్ శుక్రవారం ఉదయం ప్రొఫెసర్ స్టీవెన్ జార్డింగ్‌తో దాదాపు రెండు గంటలు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్నీ జనసేన పార్టీ సోషల్‌మీడియాలో వెల్లడించింది. స్టీవెన్, పవన్ భేటీ అయినప్పుడు తీసిన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. అనంతరం పవన్ కల్యాణ్ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు, అమెరికా న్యూక్లియర్ పాలసీ రూపకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2 గంటల తర్వాత హ్యాంప్‌షైర్ గవర్నర్‌తో భేటీ అయ్యారు. లంచ్ అనంతరం 3.30 గంటలకు నార్త్ హ్యాంప్‌షైర్‌లోని నషువా సిటీ చేరుకొని అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు లత మంగపూడితో సమావేశంలో పాల్గొంటారని పార్టీ ప్రతినిధులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
సాయంత్రం 4 గంటలకు నషువాలోని రివర్ యూనివర్సిటీ దగ్గర భారతీయ సంతతి వారు నిర్వహిస్తున్న కార్ ర్యాలీలో పాల్గొని, అనంతరం ఎన్నారైలు ఏర్పాటు చేసిన పార్టీలో భాగం కానున్నట్లు తెలిపారు. రేపు హార్వర్డ్ యూనివర్సిటీ లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతారని, ఆ ప్రసంగాన్ని ప్రపంచంలోని అందరూ చూసేవిధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.