Pawan Kalyan, Jr NTR: ఆ విషయంలో పవన్, తారక్ గ్రేట్ అంటున్న ఫ్యాన్స్!

  • July 30, 2022 / 01:30 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. మాస్ ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న హీరోలలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.

బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో 85,000 కంటే ఎక్కువమంది యూట్యూబ్ ఛానల్ లైవ్ లో తారక్ స్పీచ్ ను చూశారు. తన స్పీచ్ తో ఆకట్టుకునే హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. తారక్ సినిమా కాకపోయినా తారక్ స్పీచ్ కోసమే ఈ స్థాయిలో ప్రేక్షకులు బింబిసార ఈవెంట్ ను చూశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ మాట్లాడిన పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం వల్ల కూడా ప్రేక్షకుల నుంచి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

మరో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరే హీరో మూవీ ఈవెంట్ కు హాజరైనా కూడా యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడంతో పాటు పవన్ స్పీచ్ కోసమే పవన్ గెస్ట్ గా హాజరయ్యే ఇతర హీరోల ఈవెంట్లను చూసే అభిమానులు అయితే ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ స్థాయి క్రేజ్ పవన్, తారక్ లకు మాత్రమే సాధ్యం కావడంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

భవిష్యత్తులో పవన్ తారక్ కలిసి నటిస్తే బాగుంటుందని మరి కొందరు అభిమానులు కోరుకుంటున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి డైరెక్టర్లు ప్రయత్నిస్తే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టం కాదని చెప్పవచ్చు. ఈ ఇద్దరు హీరోల రెమ్యునరేషన్లు కూడా దాదాపుగా సమానం కావడం గమనార్హం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus