పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ పేరే చాలు కొన్ని కోట్ల గుండెలు కొట్టుకున్నాయి అని చెప్పడానికి. ఈ పేరే చాలు, కొన్ని కోట్ల మంది అభిమానులకు ఆరాధ్య దైవం అని చూపించడానికి, ఇంకా చెప్పాలి అంటే ఈ పేరే చాలు రాజకీయాల్లో సైతం సరికొత్త అలాజని సృష్టించడానికి. ఇప్పటివరకూ పవన్ అంటే ఒక హీరో, పవన్ అంటే ఒక పాలిటీషియన్, పవన్ అంటే ఒక సోషియల్ సర్విస్ చేసే ఒక మహోన్నతమైన రూపం. అయితే ఇప్పుడు పవన్ బాట మార్చాడు, మాట మార్చి మరో కొత్త రూపంలో కనిపించనున్నాడు అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే…గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ ఓ టీవీ షోలో పాల్గొంటాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి, తొలుత అవి ఫేక్ న్యూస్ అని కొట్టి పడేసినప్పటికీ, ఈ విషయం నిజమే అని, దానిపై ఒక క్లారిటీ వచ్చింది.
ఇంతకీ పవన్ బుల్లి తెరపై ఏ ప్రోగ్రామ్ చెయ్యనున్నాడు అంటే… ఈటీవీ లో ఒక వినూత్న ప్రోగ్రామ్ కు హోస్ట్ గా ఉండబోతున్నాడు. ఆ ప్రోగ్రామ్ కూడా….బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నిర్వహిస్తోన్న ‘సత్యమేవ జయతే’ ప్రోగ్రాం. సామాజిక సమస్యలపై ఆధారపడి ఈ షో నడుస్తుంటుంది. ఎందరికో ఆసరాగా నిలిచిన ఇలాంటి కార్యక్రమాన్ని తెలుగులో కూడా నిర్వహించడానికి రామోజీరావు పవన్ తో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయి. ఇక సినిమాల్లో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకునే దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్ ఈ కార్యక్రమాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. ఏది ఏమైనా…పవన్ ప్రజల మనిషి కాబట్టి పవన్ చేసే ఏపనైనా…ప్రజల కోసం చేస్తాడు అనడానికి ఇదో నిదర్శనం.