Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గ్రేట్ అంటున్న ఫ్యాన్స్.. ఇంత రిస్క్ చేశారంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది.

అయితే టీజర్ కోసం పవన్ కళ్యాణ్ జ్వరంలోనూ డబ్బింగ్ చెప్పడం గమనార్హం. పవన్ కళ్యాణ్ గ్రేట్ అని పవన్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. డైరెక్టర్ సముద్రఖని మొబైల్ డబ్బింగ్ యూనిట్ సహాయంతో ఈ డబ్బింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మంగళగిరిలో ఈ డబ్బింగ్ ప్రక్రియ జరిగిందని తెలుస్తోంది.

వినోదాయ సిత్తం రీమేక్ గా తెరకెక్కిన బ్రో సినిమా టీజర్ సరికొత్త రికార్డులను వ్యూస్ పరంగా క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పవన్ ఇమేజ్ కు అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేయడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారని తెలుస్తోంది.

ఒకవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నెల రోజుల గ్యాప్ లో మెగా హీరోలు నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ మూడు సినిమాలలో ఎన్ని సినిమాలు హిట్టవుతాయో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus