పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పాత పవన్ సినిమాల్ని మరోసారి వేస్తే బాగుంటుంది అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. మొన్నీమధ్య మహేష్‌బా బర్త్‌డే సందర్భంగా ‘పోకిరి’ ఇలానే వేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పవన్ పుట్టిన రోజున ఏం తీసుకొస్తారు అని అనుకుంటుండగా హైదరాబాద్‌లో రెండు పవన్ సినిమాలు సందడి చేస్తున్నారు. అందులో ఒకటి ‘జల్సా’ అయితే, రెండోది ‘తమ్ముడు’.
వినాయకచవితి, పవన్ జన్మదినం రెండూ దగ్గర దగ్గరగా రావడంతో నగరంలోని కొన్ని థియేటర్లలో ‘జల్సా’ షోలు వేయాలని నిర్ణయించారు. తొలుత ఈ సినిమా టికెట్లు తెగేలా కనిపించకపోయినా.. ఇప్పుడు చూస్తే అన్నిచోట్లా హౌస్‌ఫుల్స్ కనిపిస్తున్నాయి. దీంతో పవన్ క్రేజే వేరు అని కాలర్ ఎగేరేస్తున్నరు ఫ్యాన్స్. ఇంతలోనే మరో న్యూస్ కూడా బయటికొచ్చింది. అదే ‘తమ్ముడు’ సినిమాను కూడా సిటీలో వేస్తున్నారు. ఇంకేముంది ఆ సినిమాకు కూడా టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
బుక్‌మైషోలోకి వెళ్లి చూస్తే.. గంటగంటలకు కొన్ని థియేటర్లు కొత్తగా యాడ్ అవుతున్నాయి. అలా అవ్వడం ఆలస్యం టికెట్లు అమ్ముడైపోయి హాస్‌ఫుల్స్ కనిపిస్తున్నాయి. ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లోని బిగ్ స్క్రీన్‌లో కూడా ఈ సినిమాకు షోలు ఉన్నాయి. ‘తమ్ముడు’ సినిమాకు షోలు ఆగస్టు 31, సెప్టంబరు 1న ఉండగా.. ‘జల్సా’ సినిమా కోసం సెప్టెంబరు 1, 2 తేదీల్లో ఉన్నాయి. థియేటర్ల సంఖ్య ఈ రోజు, రేపు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు.
ఈ రెండు సినిమాలే కాకుండా పవన్ మరికొన్ని సినిమాల్ని కూడా ఇలానే సిద్ధం చేస్తే బాగుండు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అప్పటి సినిమాలు ఇప్పుడు ప్రదర్శించడానికి అంత అవకాశం ఉండదు. సినిమాల్ని రీమాస్టర్ చేసి సిద్ధం చేయాలి. దీని కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అయితే ఊళ్లలోని థియేటర్లలో ఆయా సినిమాల్ని ప్రదర్శిస్తారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 2 వరకు పవన్ సినిమాల మేళా నడుస్తుంది అన్నమాట.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!