ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఈ డైలాగ్ చాలాసార్లు విని ఉంటారు. రాజకీయాలు, సినిమాల్లో ఈ డైలాగ్ ఎక్కువగా వాడుతుంటారు. ఒకే ఫొటోకు రెండు స్టేట్‌మెంట్లు.. ఈ స్టేట్‌మెంట్‌ను కూడా ఇంచుమించుగా ఆ రెండు రంగాల వాళ్లే వాడుతుంటారు అని చెప్పొచ్చు. తాజాగా ఇలాంటి పనే చేశారు పవన్ కల్యాణ్. కొత్త సినిమా ప్రారంభం సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ ఫొటో రిలీజ్ చేసింది. ఈ క్రమంలో సినిమా ఆఫీసులో తీసిన పవన్ ఫొటోస్‌ను సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసింది.
వాటిలో ఓ వస్తువును చూసి.. పవన్ తెలివి ఇదీ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. పవన్ కల్యాణ్‌ను, అతని సోషల్ మీడియా అకౌంట్స్‌ను, అతని సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థల సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఫాలో అయ్యేవారికి మేం ఏ ఫొటోల గురించి మాట్లాడుతున్నామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘వినోదాయ చిత్తాం’ సినిమా రీమేక్ షూటింగ్ ప్రారంభం అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసిన ఫొటోల గురించే ఇదంతా. ఆ ఫొటోల్లో పవన్ కార్గో ప్యాంటు, బ్లాక్ హూడీతో కనిపించారు.
టేబుల్ మీద ఏదో పేపర్ ఉంటే చదువుతున్నారు. అయితే డైలాగ్ పేపర్ అవ్వొచ్చు. అయితే ఆ టైమ్‌లో పవన్ చేతిలో ఉన్న గ్లాసే ఇప్పుడు హాట్ టాపిక్. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న రిచ్ ప్రొడక్షన్ హౌసెస్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి అని చెప్పాలి. అలాంటి ఆఫీసులో టీని గాజు గ్లాసుల్లో సర్వ్ చేస్తారు. అందులో పవన్ లాంటి స్టార్ హీరోకు గాజు గ్లాసులో ఇస్తారా? తక్కువలో తక్కువ పింగాణీ గ్లాసుల్లో ఇస్తారు. కానీ పవన్ చేతిలో గాజు గ్లాసులో టీ ఉండటమే ఇక్కడ విషయం.
ఆ గాజు గ్లాసు దేనికి గుర్తు అనేది మీకు తెలిసే ఉంటుంది. పవన్ పార్టీ జనసేన గుర్తు గాజు గ్లాస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఒకే ఫొటోతో రెండు స్టేట్‌మెంట్‌లు పవన్ ఇచ్చాడని చెబుతున్నారు. ఇటు పాలిటిక్స్ అటు సినిమాలను కవర్ చేస్తూ ఆ ఫొటో రిలీజ్ చేశారు అని అంటున్నారు. మరి ఈ మాటకు పవన్ ఏం అంటారో చూడాలి. నిజానికి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఎన్నికల సంఘం చాలా కాలం క్రితమే రద్దు చేసింది. ఆ గుర్తు ఇతరులకు కేటాయించినట్లు సమాచారం. అయినప్పటికీ జనసేన ప్రచార సామాగ్రిలో అదే గుర్తు కనిపిస్తోంది.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?