రాజకీయాల్లో ఉన్నవాళ్లంతా రాజకీయాలే చేస్తారా? వాళ్ల వ్యాపారాలు ఉండవా? వృత్తులు ఉండవా? అని అడిగితే.. కచ్చితంగా ఉంటాయి అనే చెబుతారు. అయితే రాజకీయాల్లో ఉండే వాళ్లు సినిమా వాళ్లు అయితే మాత్రం లెక్కలు వేరే ఉంటాయి. అలాంటి లెక్కలు తాజాగా ఎవరి గురించైనా మాట్లాడుతున్నారు అంటే.. అది కచ్చితంగా పవన్ కల్యాణ్ అనే చెప్పాలి. సినిమాలు – రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్ కల్యాణ్ ఆదాయం గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది.
2019 ఎన్నికల సమయంలో కూడా పవన్ కల్యాణ్ రెండు పడవల ప్రయాణం గురించి చర్చ వచ్చింది. తాజాగా మరోసారి అదే జరుగుతోంది. దానికి కారణం పవన్ రీసెంట్‌గా వరుస సినిమాలు ఓకే చేస్తుండటమే. మొన్నామధ్య పవన్ కూడా తన సినిమాల సంపాదన మొత్తం రాజకీయాల్లోనే పెడుతున్నానని, పార్టీ కోసం, పార్టీ జనాల కోసం పెడుతున్నానని చెప్పారు కూడా. అలా పవన్ సంపాదన మొత్తం పాలిటిక్స్‌లోకే వెళ్లిపోతున్నాయని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే కుటుంబం కోసం పవన్ ఏం దాచుకోవడం లేదా అనే డౌట్ వస్తుంది.
పవన్ పరిస్థితి ఇతర పార్టీ నేతలకు భిన్నంగా ఉంటుంది. తన పార్టీకి అన్నీ తానే. సాధారణంగా పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. డబ్బుతో కూడిన పని. ఆ డబ్బంతా తన జేబులోంచే తీయాలి. ఇతర పార్టీల తరహాలో పవన్‌కి పెట్టుబడి పెట్టడానికి ఎవరూ లేరు అని అంటుంటారు. దాంతోపాటు ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా వెంటనే స్పందిస్తాడు. కౌలు రైతుల విషయమే చూసుకుంటే.. ఏ పార్టీ, ఏ ప్రభుత్వమూ చేయని పనిని పవన్ చేస్తున్నాడు.
ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఇచ్చాడు. మరోవైపు జన సైనికులకు బీమా కడుతున్నాడు. ఇది కూడా అంత తక్కువేం కాదు. లక్షల మందికి ఇన్సూరెన్స్ పే చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. నెలకు కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఇవన్నీ చూసుకోవడానికే పవన్ వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నాడు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?