Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

  • May 24, 2025 / 05:59 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

కొద్ది రోజులుగా జరుగుతున్న థియేటర్ల ఇష్యూ అందరికీ తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ ను గుప్పిట పెట్టుకొని ఆడిస్తున్న… ‘ఆ నలుగురు’ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. తమకు నచ్చిన సినిమాలకి ఎక్కువ థియేటర్లు ఇచ్చుకోవడం… మిగతా సినిమాలకి థియేటర్లు ఇవ్వకపోవడం వంటి పంచాయితీలు ఆ నలుగురు పెడుతుంటారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే తంతు. నిర్మాత తన సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసుకోవాలి అంటే ‘ఆ నలుగురు’ చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. తమ సినిమాలు ఉంటే అంతా బాగానే ఉంటుంది. వేరే నిర్మాతలు అదీ వాళ్ళకి నచ్చని వాళ్ళు అయితే సమస్యలు పుట్టించడం వీరి నైజం. చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు నిర్మాతలందరూ కలిసి గుట్టుగా రావాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పిన మాటను వీళ్ళు పక్కన పెట్టేశారు. అంతేకాదు పవన్ సినిమా వస్తున్నప్పుడు థియేటర్లు బంద్ చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు గోల పెట్టేలా వాళ్ళని గిల్లారు. మల్టీప్లెక్సుల మాదిరే తమకు కూడా పర్సెంటేజీలు కావాలని డిమాండ్ చేసేలా చేశారు. చిత్రసీమ బాగోగులు కోరి ఎన్నో ఇబ్బందులు పడిన పవన్ కళ్యాణ్ కి చిత్ర సీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది.

Pawan Kalyan

BJP’s south india strategy starring Vijay and Pawan Kalyan

దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి రియాక్షన్ వచ్చింది. ఓ లెటర్ ను వారు విడుదల చేశారు. “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్న వారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే – తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలి అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు సూచించినా సానుకూలంగా స్పందించలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!
  • 3 Kamal Haasan: ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

గత ప్రభుత్వ ఛీత్కారాలు : తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాల్జేసింది అనేది తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి. రూ.కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి.

గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? ఎన్నికలకు ముందు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పిన విధంగానే- కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. శ్రీ అక్కినేని నాగార్జున (Nagarjuna)  కుటుంబానికి చెందినవారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దీనిపై ఆధారపడినవారు ఇబ్బంది పడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం.

Telugu Film Chamber Gives Clarity on Theatre Strike (1)

తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని శ్రీ పవన్ కల్యాణ్ గారు సూచించారు. శ్రీ దిల్ రాజు (Dil Raju), శ్రీ అల్లు అరవింద్ (Allu Aravind), శ్రీ డి.సురేష్ బాబు (D. Suresh Babu), శ్రీమతి వై.సుప్రియ (Supriya Yarlagadda), శ్రీ చినబాబు (S. Radha Krishna), శ్రీ సి.అశ్వనీదత్ (C. Aswani Dutt), శ్రీ నవీన్ ఎర్నేని (Naveen Yerneni) తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది.

రిటర్న్ గిఫ్ట్ స్వీకారం… సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ :

సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న శ్రీ పవన్ కల్యాణ్ తెలుగు సినిమాకు చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతో చర్చిస్తారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ ఆలోచన చేశారు. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించనున్నారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు.

Pawan Kalyan donates 50 lakhs

థియేటర్ల ఆదాయంపై ఆరా:

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటి కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారు.థియేటర్లను సంబంధిత యజమానులు నడపడం లేదని, లీజు దారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే లీజు దారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు. రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపై ఈ సందర్భంగా చర్చించారు. టికెట్ సేల్ కీ, వచ్చే పన్నుకీ అంతరం ఏ మేరకు ఉందో చూడాలని నిర్ణయించారు.

Allu Arjun

అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో – సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం. వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. ఈ మేరకు తూనికలు కొలతల అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తో తనిఖీలు చేయించడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందనున్నాయి. ఈ అంశాలపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారితోపాటు హోమ్ శాఖ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారు.

రాష్ట్రంలో మల్టీప్లెక్సులు ఎన్ని ఉన్నాయి? :

రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా రెండు మూడు స్క్రీన్స్ గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు, సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? కౌంటర్ లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ ల నిర్వహణ వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్ధాల ధరలపై కూడా దృష్టి సారిస్తారు.

నైపుణ్యాల పెంపుతోనే పరిశ్రమగా అభివృద్ధి :

కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు 24 విభాగాల్లో నైపుణ్యాలు పెంపుదల… అధునాతన సాంకేతికత వినియోగం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు యోచిస్తున్నారు. పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరి పుచ్చకుండా యువతలోను, ఇప్పటికే చిత్ర రంగంలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు నైపుణ్యాల అభివృద్ధి కోసం- అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియమ్స్ లాంటివి ఆంధ్ర ప్రదేశ్ లో విరివిగా నిర్వహిస్తారు. సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్ వరకు ఉండే విభాగాలలో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే- పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వృద్ధి చెందుతుంది. ఈ దిశగా శ్రీ పవన్ కల్యాణ్ ఆలోచన చేశారు. కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు” అంటూ ఇందులో రాసి ఉంది.

Pawan Kalyan reacts to Fans Died Announce Ex Gratia (1)

(ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన)

తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు

•ఆంధ్రప్రదేశ్ లో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా?

•గత ప్రభుత్వం సినిమా…

— JanaSena Party (@JanaSenaParty) May 24, 2025

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Biker Glimpse: ‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ.. ఇలాంటి కంటెంట్ తో ‘అఖండ 2’ కి పోటీనా?

Biker Glimpse: ‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ.. ఇలాంటి కంటెంట్ తో ‘అఖండ 2’ కి పోటీనా?

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

related news

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

trending news

Biker Glimpse: ‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ.. ఇలాంటి కంటెంట్ తో ‘అఖండ 2’ కి పోటీనా?

Biker Glimpse: ‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ.. ఇలాంటి కంటెంట్ తో ‘అఖండ 2’ కి పోటీనా?

11 mins ago
2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

4 hours ago
Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

6 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

18 hours ago
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

19 hours ago

latest news

Peddi: ‘అచ్చియమ్మ’ ఇప్పుడెందుకు వచ్చింది? ‘పెద్ది’ టీమ్‌ ప్లానింగ్‌ ఇదేనా?

Peddi: ‘అచ్చియమ్మ’ ఇప్పుడెందుకు వచ్చింది? ‘పెద్ది’ టీమ్‌ ప్లానింగ్‌ ఇదేనా?

28 mins ago
Ajith: కరూర్‌ తొక్కిసలాటపై ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన అజిత్‌.. ఏమన్నాడంటే?

Ajith: కరూర్‌ తొక్కిసలాటపై ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన అజిత్‌.. ఏమన్నాడంటే?

5 hours ago
Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

19 hours ago
Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

19 hours ago
Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version