Pawan Kalyan: జనసేనానికి డాక్టరేట్ ప్రకటించిన వేల్స్ వర్సిటీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాల పరంగా ఎంతో బిజీగా మారిపోయారు. మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈయన పూర్తి దృష్టి ఎన్నికల పైన పెట్టారు దాంతో ఈయన కమిట్ అయినటువంటి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

ఇలా హీరోగా రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎలాంటి అధికారం లేకపోయినా కూడా ఎంతోమందికి సహాయ సహకారాలు చేస్తూ తన మంచి మనసు చాటుకున్నారు. ఇదే విషయాన్ని ఎంతోమంది ఎన్నో సభలలో ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ నుంచి ఈయన గౌరవ డాక్టరేట్ కి ఎంపిక అయ్యారు.

జనవరిలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ ఈవెంట్ కి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా ఆహ్వానించారు. కానీ జనసేనాని మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇలా యూనివర్సిటీ నుంచి తనకు పిలుపు రావడంతో తనను డాక్టరేట్ కు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు అదే విధంగా తనకు అందించబోయే ఈ డాక్టరేట్ తనకంటే ఎంతో గొప్పవారు గొప్ప గొప్ప సేవలు చేసిన వారికి అందించాలని కోరుతూ ఈయన లేఖ రాశారు.

ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు షెడ్యూల్ రాబోతున్నటువంటి తరుణంలో నేను ఈ వేడుకకి కూడా హాజరుకాలేను అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా యూనివర్సిటీకి లేఖ రాశారు. ఇలా తనకు వచ్చినటువంటి గొప్ప గౌరవాన్ని పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడంతో కొంతమంది అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus