Pawan Kalyan: అన్నయ్యకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు చెప్పిన పవన్.. ఏమన్నారంటే?
- August 22, 2024 / 12:49 PM ISTByFilmy Focus
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు కావడంతో అభిమానులకు ఈరోజు పండగ రోజు అనే సంగతి తెలిసిందే. మూడు తరాలతో పోటీ పడి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న చిరంజీవి త్వరలో విశ్వంభర (Vishwambhara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా టీజర్ ఈరోజే విడుదలవుతుందని ఫ్యాన్స్ భావించినా మేకర్స్ మాత్రం ఈరోజు టీజర్ రిలీజ్ కావడం లేదని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.
Pawan Kalyan

అదే సమయంలో ఫ్లాపైన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే జయాపజయాలకు అతీతంగా చిరంజీవి కెరీర్ సాగింది. అభిమానుల హృదయాల్లో మెగాస్టార్ గా చిరంజీవి ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జనరేషన్ లో ఎంతోమందికి చిరంజీవి స్పూర్తిగా నిలిచారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిరంజీవికి ప్రేమ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

నా దృష్టిలో అన్నయ్య చిరంజీవి ఆపద్భాందవుడు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అని వెల్లడించారు. కావాల్సిన వారి కోసం అన్నయ్య ఎంతవరకైనా తగ్గుతారని అభ్యర్థిస్తారని పవన్ పేర్కొన్నారు. అన్నయ్య జనసేనకు 5 కోట్ల రూపాయలు, మద్దతు ఇచ్చి జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చారని పవన్ వెల్లడించారు. చిరంజీవి లాంటి గొప్ప దాతను అన్నయ్యగా ఇచ్చినందుకు భగవంతునికి సదా కృతజ్ఞతలు చెబుతున్నానని పవన్ అన్నారు.

వదినమ్మతో అన్నయ్య చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి పవన్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో భారీ మల్టీస్టారర్ సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఆపద్బాంధవుడు అన్నయ్య
నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య… pic.twitter.com/rNHfPWP03g
— JanaSena Party (@JanaSenaParty) August 22, 2024















