Bro Movie: బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ అలా ప్లాన్ చేశారా.. పవన్ ఫ్యాన్స్ ఫీలవుతారంటూ?

పవన్ కళ్యాణ్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బ్రో మూవీ నుంచి తాజాగా రెండు సాంగ్స్ రిలీజ్ కాగా ఈ రెండు సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బ్రో మూవీకి అన్ని హక్కులతో కలిపి 180 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని భోగట్టా. ఈ సినిమా వల్ల నిర్మాతలకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ అతి త్వరలో జరగనుంది.

అయితే సాధారణంగా ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే ఎవరైనా ప్రముఖ సెలబ్రిటీలు ఆ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరై ఆ ఈవెంట్ ను సక్సెస్ చేయడం కోసం తమ వంతు సహాయం చేస్తారు. అయితే బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మినహా మరెవరినీ ఆహ్వానించొద్దని పవన్ కళ్యాణ్ నిర్మాతలకు సూచనలు చేశారని సమాచారం. ఈ మూవీ ఈవెంట్ కు హాజరైతే వాళ్లను సైతం ఒక పార్టీ నేతలు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందని పవన్ భావిస్తున్నారని భోగట్టా.

హీరోలలో పవన్, సాయితేజ్ మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది. కేతిక శర్మ, ప్రియా వారియర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమాతో తమకు స్టార్ స్టేటస్ దక్కుతుందని వాళ్లు భావిస్తున్నట్టు సమాచారం. పవన్ ఈ సినిమా కోసం కేవలం 25 రోజుల డేట్లు కేటాయించి షూట్ లో పాల్గొన్నారనే సంగతి తెలిసిందే. సినిమాలో పవన్ పాత్ర 90 నిమిషాలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది.

ఈ మధ్య కాలంలో విడుదలైన పెద్ద సినిమాలేవీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు. బ్రో సినిమా మాత్రం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బ్రో సినిమా కమర్షియల్ గా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. బ్రో (Bro Movie) సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఆకట్టుకుంటుందేమో చూడాలి.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus