Akira Nandan: పవన్ అభిమానులకు అకీరా షాకిచ్చినట్టా.. సర్ప్రైజ్ చేసినట్టా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు.. రేణు దేశాయ్ గారాల కొడుకు అయిన అకీరా నందన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుండి విడిపోయి దాదాపు 10 ఏళ్ళు కావస్తోంది. అయినా సరే పవన్ అభిమానులు..వదిన అని పిలుస్తుండటం మానలేదు. ఇలా పిలిస్తే ఆమెకు చాలా కోపం వస్తుంది. అయినా సరే కావాలని పవన్ అభిమానులు ఆమెను రెచ్చగొడుతున్నట్టు ఫీలవుతూ ఉంటుంది.

పవన్ అభిమానులు ఒక్కోసారి హద్దులు మీరుతారు అన్నది వాస్తవం. కానీ వారి కోపం వెనుక అర్థం కూడా ఉంటుంది. కాకపోతే రియాక్ట్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగా రియాక్ట్ అవుతారు.. అదే రేణు దేశాయ్ కూడా చెబుతుంటుంది. ఇక అకీరా నందన్ విషయంలో పవన్ అభిమానులు ఎక్కువ చనువు తీసుకుని అతన్ని జూనియర్ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఇది రేణు దేశాయ్ కు ఎంత మాత్రం నచ్చదు.

అందుకే రెండు, మూడు రోజులుగా పవన్ అభిమానుల పై ఆమె మండిపడుతూ కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అకీరా నందన్ హీరో అవుతాడు అనుకుంటే.. అతను మ్యూజిక్ డైరెక్టర్ గా మారి అభిమానులకు షాకిచ్చాడు. అయితే సినిమా కోసం కాదు ఓ షార్ట్ ఫిలింకి అకీరా సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు.

అదే ‘రైటర్స్ బ్లాక్’. కార్తికేయ యార్లగడ్డ ఈ షార్ట్ ఫిలింని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇక (Akira Nandan) అకీరా ఈ షార్ట్ ఫిలింకి సంగీతం అందించిన విషయం అడివి శేష్ ద్వారా బయటపడింది. తన ట్విట్టర్ లో ఈ షార్ట్ ఫిలింకి సంబంధించిన లింక్ ను అడివి శేష్ షేర్ చేసి తన స్నేహితుడు అకీరా నందన్ ను అభినందించాడు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus