పవన్ కళ్యాణ్ స్టోరీ లో ఎన్టీఆర్ నటించనున్నారా?

సినీ పరిశ్రమలో హీరోలందరూ బాగా కలిసి ఉంటారని చెప్పడానికి మరో సంఘటన తాజాగా జరిగింది. బయట ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ ఒకరికొకరు కొట్టుకోవడం చూసాం.. కానీ వారిద్దరూ మాత్రం మంచి స్నేహితుల్లా ఉన్నారు. అసలు విషయంలోకి వెళితే.. త్రివిక్రమ్ అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ కోసం మరో కుటుంబ కథను సిద్ధం చేసారంట. వినిపించారు కూడా. స్టోరీ మొత్తం విన్న పవన్.. ఆ స్టోరీ తనకన్నా ఎన్టీఆర్ కి బాగా సూటవుతుందని త్రివిక్రమ్ కి సలహా ఇచ్చారంట. అదే విధంగా ఆ స్టోరీ ని ఎన్టీఆర్ కి వినిపించడం,  ఆయన నచ్చడం సినిమా ప్రారంభించడం జరిగిపోయాయి.

ఇంతవరకు నందమూరి హీరోలవైపు వెళ్లని త్రివిక్రమ్ ని ఆ వైపుగా అడుగులు వేయించిన క్రెడిట్ పవన్ కళ్యాణ్ సొంతమని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా ప్రారంభత్సవానికి పవన్ వెళ్లడం.. నందమూరి, మెగా అభిమానుల మధ్య వైరాన్ని తుంచి వేసిందని వివరించారు.  ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తు చేసి మార్చిలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ కథ, ఎన్టీఆర్ ఇమేజ్.. త్రివిక్రమ్ ట్యాలెంట్ .. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.. చెప్పడం కష్టం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus