Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు అస్వస్థత..అసలు ఏమి అయిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొని విరామం లేకుండా ఆ వెంటనే వారాహి యాత్ర చేపట్టారు. 2024 ఎన్నికలు లక్ష్యంగా ప్రచారంలోకి దిగిన ఆయన కొద్ది రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. జనం మధ్యలోనే ఉంటూ జనం సమస్యలు తెలుసుకుంటూ, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో తెలియజేస్తూ, తన తోటి కథానాయకుల గురించి మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ ప్రేక్షకాభిమానుల మనసులు దోచుకుంటున్నారు.

అలాగే రాజకీయా వ్యవస్థ గురించి, ఓటు హక్కు వినియోగం గురించి వివరిస్తూ జనాలను చైతన్య పరుస్తున్నారు జనసేనాని పవన్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అవిశ్రాంతంగా వారాహి యాత్ర కొనసాగించడంతో స్వల్పంగా ఇబ్బంది పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పెదఅమిరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్‌తో మంగళవారం (జూన్ 27) ఉదయం జరగాల్సిన భీమవరం నేతల భేటీ అనారోగ్యం కారణంగా మధ్యాహ్నానికి వాయిదా పడింది.

విశ్రాంతి అనంతరం పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాల వారు తెలియజేశారు. సినిమాల నుండి కొద్ది రోజుల బ్రేక్ తీసుకున్నారు పవర్ స్టార్. తన మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ‘బ్రో’ మూవీ చేసిన పవన్ కేవలం 22 రోజుల్లోనే తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసేశారు. ఇందుకు పారితోషికంగా రోజుకి రూ. 2 కోట్ల చొప్పున తీసుకున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ సంస్థ నిర్మిస్తుండగా.. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో టీజర్ వదలనున్నారు.

జూలై 28న చిత్రం విడుదలకానుంది. రీ ఎంట్రీ తర్వాత వరుసగా క్రేజీ సినిమాలను లైన్‌లో పెడుతున్న పవర్ స్టార్.. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే హిస్టారికల్ ఫిలిం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. సురేందర్ రెడ్డితోనూ ఓ సినిమా అనౌన్స్ చేశారు కానీ తర్వాత దాని గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. హరీష్ శంకర్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే స్టార్ట్ అయింది.

సడెన్‌గా ‘సాహో’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో ‘ఓజీ’ మూవీ మొదలెట్టేశారు. అప్పుడే 50 శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలకపాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. పవన్ (Pawan Kalyan) తండ్రి పాత్రలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus