మెగా స్టార్, పవర్ స్టార్ ఈ ఇద్దరూ వారి అభిమానులకు దేవుళ్ళు. అయితే ఇండస్ట్రీలో టాప్ పొసిషన్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎవరి పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు. అందులో చిరు పార్టీ ‘ప్రజారాజ్యం’ కాంగ్రెస్ లో విలీనం కాగా, ఇక పవన్ పార్టీ ‘జనసేన’ బీజేపీకి దాసోహం అంటుంది. అయితే దాదాపు 10 సంవత్సరాల నుండి ఎడమొఖం పెడమొఖం గా ఉన్న ఈ అన్నదమ్ములు ఇప్పుడు కలవటంలో ఇండస్ట్రీతోపాటు, రాజకీయాల్లోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తొలుత ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నప్పటికీ ఆ గొడవలు అన్నీ సర్దుమణిగిపోవడంతో వీళ్ళిద్దరూ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న భయం అందరిలో ఉంది. అయితే పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం…రాజకీయంగా వీరిద్దరూ ఒకటిగా మారే ఛాన్స్ ఉందని, అదే జరిగితే మళ్లీ 2009నాటి పరిస్తితి వస్తుంది అని కొందరు అంటుంటే…అంత సీన్ లేదు అప్పుడే 20సీట్లు రాలేదు.
ఇప్పుడు కనీసం డిపాజిట్లు కూడా రావు అంటూ మరికొందరి వాదన. అయితే ఈ ఇద్దరిలో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు కానీ, ఇప్పటికైతే…చిరంజీవి తీసుకున్న నిర్ణయాలకి పవన్ కళ్యాణ్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో చిరు ఎలానో ముఖ్యమంత్రి అభ్యర్ధి కాబట్టి ఆయన్ని సపోర్ట్ చేస్తూ పవన్ ముందుకు వెళితే…చిరుకి ప్లస్ అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో చూడాలి.